NCP working president Supriya Sule : రెబెల్స్ తిరిగి వస్తే సంతోషిస్తాం.. సుప్రియాసూలే వ్యాఖ్యలు

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ సీఎం ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరిన తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు చేసిన వారంతా తిరిగి పార్టీలోకి వస్తే తాను సంతోషిస్తానని సుప్రియా చెప్పారు....

NCP working president Supriya Sule : రెబెల్స్ తిరిగి వస్తే సంతోషిస్తాం.. సుప్రియాసూలే వ్యాఖ్యలు

Supriya Sule comment

Updated On : July 3, 2023 / 6:53 AM IST

NCP working president Supriya Sule : మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకుడు అజిత్ పవార్ సీఎం ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరిన తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు చేసిన వారంతా తిరిగి పార్టీలోకి వస్తే తాను సంతోషిస్తానని సుప్రియా చెప్పారు. (Would be happy if rebels) తన సమీప బంధువు అయిన తిరుగుబాటు నేత అజిత్ పవార్ తో తన సంబంధాలు మారవని, ఆయన ఎప్పుడూ తన సోదరుడేనని ఆమె స్పష్టం చేశారు.

BCCI Announces Women’s Squad : బంగ్లాదేశ్ సిరీస్‌కు భారత మహిళల జట్టు… బీసీసీఐ ప్రకటన

తన తండ్రి శరద్ పవార్ పార్టీలో అందరినీ కుటుంబంలా చూసుకున్నారని, కాని ఈ సంక్షోభానికి కారణాలపై పార్టీ విశ్లేషిస్తుందని సుప్రియా చెప్పారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాల ఐక్యతను ప్రభావితం చేయవని సుప్రియా అన్నారు. పార్టీని పునర్నిర్మించేందుకు పోరాడుతామని ఆమె చెప్పారు. బారామతి ఎంపీ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి, దేశ సంక్షేమం కోసం పార్టీ నూతన శక్తితో పని చేస్తుందని అన్నారు.

Leopard Attack : చిరుతపులి దాడిలో మహిళ మృతి

అజిత్ పవార్ ఎన్‌సిపితో తెగతెంపులు చేసుకున్నారు. (Ajit dada joins Shinde camp) ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఛుగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ వంటి శరద్ పవార్ విధేయులు సహా 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. గత నెలలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే ఎదగడం అజిత్ పవార్ తిరుగుబాటుకు కారణమని చెబుతున్నారు.

Nara Lokesh : అధికారంలోకి వస్తే.. ఒక్కొక్కరికి రూ.3వేలు, భారీగా ఉద్యోగాలు- నారా లోకేశ్

ఎన్సీపీని అవినీతి పార్టీగా అభివర్ణించిన బీజేపీ ఇప్పుడు తమ పార్టీ నేతలను స్వాగతిస్తోందని, బీజేపీ వ్యవహారంపై తాను వ్యాఖ్యానించనక్కర్లేదు.. తన పార్టీపైనే దృష్టి సారిస్తానని సుప్రియా చెప్పారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ, దేశాభివృద్ధి కోసం షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగం కావాలని ఎన్సీపీ నిర్ణయించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అజిత్ పవార్ కొనియాడారు.