చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ : 106 కు చేరిన మృతుల సంఖ్య 

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 06:34 AM IST
చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ : 106 కు చేరిన మృతుల సంఖ్య 

Updated On : January 28, 2020 / 6:34 AM IST

కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చైనాలో 106 చేరిన మృతుల సంఖ్యకు చేరింది. 3 వేల మందికి కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చైనాలో పాఠశాలలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. చైనా వుహాన్ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా వ్యాప్తి చెందకుండా వుహాన్ నుంచి రాకపోకలను చైనా ప్రభుత్వం నిలిపివేసింది. వుహాన్ లో చిక్కుకున్న భారతీయ వైద్య విద్యార్థులను భారత్ కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇప్పటికే చైనా నుంచి 12 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించింది. చైనా, థాయ్ లాండ్, జపాన్, అమెరికా, కొరియా, వియత్నాం, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్ లో కరోనా వైరస్ ను గుర్తించారు. 

corona

ఇక హైదరాబాద్, రాజస్థాన్, కేరళలోనూ కరోనా అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే వీరికి కరోనా సోకిందా లేదా అనేది ధృవీకరించాల్సివుంది. చైనా నుంచి వచ్చిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనా ప్రయాణాలు రద్దు చేసుకోవాలని తమ దేశ పౌరులకు అమెరికా సూచించింది. ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO కరోనా వైరస్ కు మందు లేదని..అప్రమత్తంగ ఉండాలని ప్రపంచ దేశాలకు సూచించింది. 

జనవరి 8న చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. వైరస్ వ్యాక్సిన్ ను కనుగొనే దిశగా చైనా శాస్త్రవేత్తలు ఉన్నారు. వుహాన్ నగరంలో కోటిన్నరకు పైగా ప్రజలు నివసిస్తుంటారు. అక్కడ ముఖ్యంగా  భారత్ నుంచి మేనేజ్ మెంట్ స్టడీస్, మెడికల్ స్టడీస్ కోసం వెళ్లిన విద్యార్థులు అక్కడే చిక్కుకున్నారు. చైనా నుంచి రవాణా వ్యవస్థను రద్దు చేశారు. చైనాలో దాదాపు 17 నగరాల నుంచి ఇతర దేశాలకు కనెక్టివిటీ నిల్చిపోయింది.

cvirus

ఈ వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైనా ప్రభుత్వం చెబుతోంది. కరోనా వైరస్ భారత్ లోవ్యాప్తి చెందకుండా చైనా నుంచి భారత్ కు వస్తున్న 37 వేల మంది ప్రయాణికులకు భారత ప్రభుత్వం థర్మల్ స్క్రీనింగ్స్ నిర్వహిస్తోంది. ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో స్ర్కీనర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 173  విమానాల్లో భారత్ కు వచ్చని ప్రయాణికులను పరిశీలించారు.