చైనాలో కరోనా వైరస్ తో 24వేల మంది మృతి!

చైనా నుంచి బయటి ప్రపంచానికి ఓ సంచలన వార్త తెలిసింది. చైనాలో గురువారం నాటికి చనిపోయింది 560మంది అని,వైరస్ సోకినవాళ్లు 28వేల 18మంది అని అధికారులు తెలుపగా ఇదంతా అవాస్తవమంటూ ఓ చైనా కంపెనీ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి-1,2020 నుంచి చైనా బయట ప్రపంచనాకి చెబుతున్న కరోనా మృతుల సంఖ్య కన్నా 10రెట్టు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చైనాకు చెందిన టెన్సెంట్ అనే కంపెనీ తన వెబ్ పేజీలో తెలిపింది.
చైనాలో ఇప్పటివరకు కరోనా వైరస్ తో చనిపోయింది 24వేల 589మంది అని,కరోనా సోకినట్లు నిర్థారణ అయి హాస్పిటల్ లో చేరిన వారి సంఖ్య 1లక్షా 54వేల 23మంది అని ఎపిడమిక్ సిస్ట్యువేషన్ ట్రాకర్ అనే టైటిల్ తో తన వెబ్ పేజీలో ఓ కథనాన్ని ఉంచింది. ప్రజలు దీనిని గమనించిన తర్వాత, టెన్సెంట్ వెంటనే ప్రభుత్వ “అధికారిక” సంఖ్యలను ప్రతిబింబించేలా సంఖ్యలను అప్ డేట్ చేశారు. కనీసం మూడు సందర్భాల్లో టెన్సెంట్ కరోనా మృతుల సంఖ్యను చాలా ఎక్కువగా పోస్ట్ చేసినట్లు నెటిజన్లు గమనించారు.
అయితే నిజమైన “అంతర్గత” డేటా వెనుక కోడింగ్ సమస్య ఉండవచ్చని కొంతమంది ఊహిస్తున్నారు. కాని మరికొందరు వాస్తవ సంఖ్యలను బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని నమ్ముతున్నారు. అయితే టెన్సెంట్ కంపెనీ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. వూహాన్ సిటీలోని పలు వర్గాల సమాచారం ప్రకారం…చాలా మంది కరోనా వైరస్ రోగులు చికిత్స పొందలేక, హాస్పిటల్స్ బయట మరణిస్తున్నారు.
చైనా నుంచి వస్తున్న కరోనా వైరస్ సంఖ్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా రిపోర్ట్ చేసింది. సామాజిక, రాజకీయ మరియు ఆర్ధిక సమస్యలను వివరించే బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న కైజింగ్ అనే స్వతంత్ర మ్యాగజైన్ కూడా కరోనా వైరస్ మృతుల సంఖ్యలో చైనా రిపోర్ట్ లు తప్పుగా ఉన్నట్లు తెలిపింది.