యాక్సెంచర్‌లో 25వేల మంది ఉద్యోగుల తొలగింపు.. భారతీయ టెకీలకు షాక్

గ్లోబల్ ప్రొఫెషనల్ కంపెనీ ఐర్లాండ్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఇప్పుడు అందులో నుంచి కనీసం 5 శాతం కంటే ఎక్కువగా పనితీరు కనబరచని ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక మాంద్యం కారణంగా.. ఇందులో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు కూడా ఉద్యోగాలు కోల్పోవలసి ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ (AFR)లో ప్రచురించిన ఒక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. యాక్సెంచర్ CEO జూలీ స్వీట్ నిర్వహించిన అంతర్గత సిబ్బంది సమావేశాన్ని ఉటంకిస్తూ నివేదిక ఉంది.
భారతదేశంలో యాక్సెంచర్‌లో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. లేటెస్ట్‌గా యాక్సెంచర్ తీసుకున్న చర్య వల్ల వేలాది మంది ఉద్యోగులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాంట్రాక్టులను తగ్గించడం సహా కొత్త నియామకాలను నిలిపేసి, ఇప్పటికే ఉన్న ఉద్యోగుల్లోంచి నైపుణ్యం లేని ఉద్యోగులను పంపించేయాలని సంస్థ యోచిస్తుంది.
కరోనాతో పాటు అంతర్జాతీయంగా ఇటీవల పరిణామాలు క్లయింట్లకు కేటాయించే పనిగంటలు భారీగా తగ్గినట్టు కంపెనీ చెబుతుంది. నైపుణ్యం ఉన్న ఉద్యోగులు మాత్రం ఆందోళన చెందక్కర్లేదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వృథా ఖర్చులను తగ్గించుకునేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని, సరఫరా-డిమాండ్ మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
https://10tv.in/china-says-it-found-a-new-virus-thats-even-more-deadly-than-the-coronavirus/
యాక్సెంచర్‌కు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కంపెనీలున్నాయి. అయితే భారత్‌లోని కంపెనీల్లో రెండు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా నిర్ణయం భారత్‌లోని ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడనుందని తెలుస్తుంది. భారత్‌లోని 10వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని అంటున్నారు.