పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేందుకు సిద్ధమైన ఆఫ్ఘనిస్తాన్.. అటు వైపునుంచీ వాటర్ కట్..!

భారత ప్రభుత్వం అనుసరించిన మార్గాన్ని ఆప్ఘనిస్థాన్ ఫాలో అవుతుంది.

పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేందుకు సిద్ధమైన ఆఫ్ఘనిస్తాన్.. అటు వైపునుంచీ వాటర్ కట్..!

Afghanistan plans to build dams

Updated On : May 22, 2025 / 2:10 PM IST

Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ దేశానికి దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన పాక్‌కు భారత ఆర్మీ గట్టి గుణపాఠం చెప్పింది. మరోవైపు పాకిస్థాన్ లో భాగమైన బెలూచిస్తాన్  ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ కూడా పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేందుకు సిద్ధమైంది.

 

ఇరు దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇటీవల సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాకిస్థాన్ ప్రాంతానికి వెళ్లాల్సిన నీటిని అడ్డుకుంది. ప్రస్తుతం.. భారత్ మార్గాన్నే అనుసరించేందుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధమైంది. ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతం గుండా పాకిస్థాన్‍లోకి వెళ్లే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం కొత్త ఆనకట్టలను నిర్మించాలని ఆప్ఘనిస్థాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో బలూచ్ కార్యకర్త ఒకరు ఈ విషయాన్ని పోస్టు చేశారు. “ఇది నా పాకిస్తాన్ ముగింపు ప్రాంతం. భారత్ తర్వాత, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్‌కు వారి ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి ఆనకట్టలను నిర్మించడానికి సిద్ధమవుతోంది” అని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ అధికారికంగా ధృవీకరించనప్పటికీ నీటి వనరులపై ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌ను తెరపైకి తెస్తోంది.

బలూచిస్థాన్ కార్యకర్త పోస్ట్ ప్రకారం.. తాలిబన్ జనరల్ ముబిన్ ఇటీవల ఆనకట్ట స్థలాన్ని పరిశీలించడానికి కునార్ ప్రాంతాన్ని సందర్శించారు. ముబిన్ కాబూల్ లోని ప్రభుత్వాన్ని నిధులు సేకరించి బహుళ ఆనకట్ట ప్రాజెక్టులను ప్రారంభించాలని కూడా కోరారు. ఈ నీరు మన రక్తం. మన విద్యుత్ అవసరాలను తీర్చడానికి సహాయపడే నీటిని మనం ఆపాలి. మన వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు అని ముబిన్ చెప్పినట్లు బలూచ్ కార్యకర్త పేర్కొన్నారు. కునార్ నది హిందూ కుష్ పర్వతాలలో ఉధ్భవించి కాబూల్ నదిలో కలుస్తుంది. ఇది పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తుంది.