దోస్త్ మేరా దోస్త్.. భారత్‌తో రష్యాకు ఉన్న బంధం ఏంటి? మనకు వాళ్లు అందిస్తున్న సహకారం ఎంత?

పేరున్న దేశాల్లో మనకు అండగా ఉన్న దేశం కూడా రష్యానే. కాకపోతే మన దౌత్య విధానమే సెపరేట్.

దోస్త్ మేరా దోస్త్.. భారత్‌తో రష్యాకు ఉన్న బంధం ఏంటి? మనకు వాళ్లు అందిస్తున్న సహకారం ఎంత?

India Russia Relationship : ఒకప్పటి దోస్తానా.. ఆ ఎమోషనే వేరు. అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వచ్చినా ఎవరో ఒకరు తగ్గుతారు. ఎవరు నెగ్గినా ఇద్దరూ సంతోషపడతారు. ఇద్దరు మనుషుల మధ్యే కాదు.. అలాంటి ఎమోషనల్ ఫ్రెండ్ షిప్ రెండు మధ్య దేశాల మధ్య కూడా ఉంటుంది. అందుకు భారత్, రష్యా రిలేషనే ఎగ్జాంపుల్. రష్యాతో మన దేశానికి ఉన్న సంబంధాలు ఇవాళ్టి కావు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే భారత్ తో సన్నిహితంగా ఉంటోంది మాస్కో. పేరున్న దేశాల్లో మనకు అండగా ఉన్న దేశం కూడా రష్యానే. కాకపోతే మన దౌత్య విధానమే సెపరేట్. రష్యాతో ఎంత మంచి సంబంధం ఉన్నా.. స్వయంప్రతిపత్తితో ముందుకెళ్తోంది భారత్. ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్న వేళ.. భారత్ తో మాస్కోకు ఉన్న బంధం ఏంటి? మనకు వాళ్లు అందిస్తున్న సహకారం ఎంత?

ప్రధాని మోదీ ఐదేళ్ల తర్వాత రష్యాకు వెళ్తున్నారు. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోను సందర్శించడం ఇదే తొలిసారి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు.

భారత్ కు రష్యా అత్యంత ఆత్మీయ దేశం. అగ్రరాజ్యమైన అమెరికాకు దూరంగా ఉంటూ వస్తున్న భారత్.. రష్యాతో మాత్రం హెల్దీ రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తోంది. అమెరికాతో పాటు పలు దేశాలు రష్యా, భారత్ బంధాన్ని డిస్ట్రబ్ చేయాలని కుట్రలు పన్నినా.. ఇటు భారత్, అటు రష్యా ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. భారత్-రష్యా మధ్య దౌత్య బంధం కూడా ఎక్కువే. సోవియట్ యూనియన్ గా ఉన్న రష్యా మనకు కావాల్సిన బంధువు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. భారత్, రష్యా మధ్య విభేదాలు వచ్చే పరిస్థితులు వచ్చినా దోస్తీ కంటిన్యూ అయ్యింది. రెండు దేశాలు కలిసి నడిచాయి. అనేక ఒడిదొడుకలను తట్టుకుని నిలిచాయి. ఒకరిపై మరొకరికి ఉన్న విశ్వాసం, ఒకరికి ఒకరు సహకరించుకోవడం అందుకు కారణం. ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా బంధాలను బలోపేతం చేసుకుంటూ వచ్చాయి రెండు దేశాలు.

రష్యా సహకారం ఇవాళ్టిది కాదు. అలా అని అమెరికాను కాదనలేకపోతోంది భారత్. ఆ రెండు దేశాలకు పడదు. వారిద్దరితో మనకు మంచి రిలేషన్ అవసరం. అందుకే స్వతంత్ర దౌత్య విధానాన్ని ఫాలో అవుతోంది భారత్. ఇది కూడా రష్యా, అమెరికాకు నచ్చడం లేదు. తాము చెప్పినట్లో లేదా తమతో కలిసి నడవాలనో కోరుకుంటున్నాయి ఆ దేశాలు. అందుకే అటు రష్యా, ఇటు అమెరికాతో జాగ్రత్తగా నడుచుకుంటోంది మోదీ సర్కార్. యుక్రెయిన్ తో రష్యా యుద్ధం తర్వాత ఫస్ట్ టైమ్ మాస్కోలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో రష్యాతో భారత్ బంధాలు మరింత మెరుగుపడబోతున్నాయా?

Also Read : కొంపముంచిన హామీలు, అనాలోచిత నిర్ణయాలు.. బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ ఘోర ఓటమి