90 Year Old Woman Graduation : 90 ఏళ్ల వయస్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వృద్ధురాలు
చదువుకోవాలనే సంకల్పం ఉండాలి కానీ వయస్సుతో సంబంధం లేదు. చదువుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉంటే ఏ వయస్సులోనైనా చదువుకోవచ్చు. 90 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

old woman graduation
90 year old woman graduation : చదువుకోవాలనే సంకల్పం ఉండాలే కానీ వయస్సుతో సంబంధం లేదు. చదువుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉంటే ఏ వయస్సులోనైనా చదువుకోవచ్చు. 90 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమెరికాకు చెందిన జాయిస్ డెఫాన్(90) అనే వృద్ధురాలు 71 ఏళ్ల క్రితం చదువు వదలివేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో మళ్లీ ఇప్పుడు పూర్తి చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.
అమెరికాకు చెందిన 90 ఏళ్ల జాయిస్ డెఫాన్ 1951లో నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే 1955లో ఆమెకు వివాహం కావడం, ముగ్గురు పిల్లలు పుట్టడంతో మధ్యలోనే చదువు ఆపేశారు. అయితే భర్త మరణించడంతో ఆమె మళ్లీ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెకు మరో ఆరుగురు పిల్లలు జన్మించారు.
మొత్తం తొమ్మిది మంది పిల్లల బాగోగులు చూసుకునే నేపథ్యంలో ఆమె చదువు జోలికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఆమె వయస్సు 90 ఏళ్లకు చేరింది. ఇప్పుడు ఆమెకు 17 మంది మనవళ్లు, 24 మంది మునిమనవళ్లు ఉన్నారు. అయినా జాయిస్ కు చదువుపై ఇష్టం తగ్గలేదు. ఆ విషయాన్ని మునిమనవళ్లు, మనవరాళ్లకు చెప్పారు. వారు కూడా జాయిస్ ను ప్రోత్సహించారు.
క్లాసులు కూడా అందుబాటులో ఉండటంతో మనవళ్లు, మనవరాళ్ల సాయంతో కంప్యూటర్ ఉపయోగించి ఆమె క్లాసులు వినడం నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే కోర్సులో చేరి 71 ఏళ్లు గడిచిన తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, పట్టా అందుకున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. జాయిస్ పట్టా అందుకున్న ఫొటోలను సైతం పంచుకున్నారు.
Returning to NIU in 2019 with her original 1951 student ID in hand, 90yo Joyce DeFauw will walk the stage at this weekend’s commencement, earning her degree seven decades in the making.
For more of Grandma Joyce’s inspiring story, visit: https://t.co/nFhsD9YydE#HuskiePride pic.twitter.com/qEifAQeCjS
— NIU (@NIUlive) December 5, 2022