Anwarul Haq Kakar : పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ ప్రమాణ స్వీకారం

పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. పుష్టున్ జాతి నాయకుడు అన్వరుల్ హక్ కాకర్, ఆర్థికసంక్షోభంలో ఉన్న దేశాన్ని నడపనున్నారు.....

Anwarul Haq Kakar : పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ ప్రమాణ స్వీకారం

Anwarul Haq Kakar sworn in as Prime Minister

Updated On : August 15, 2023 / 11:07 AM IST

Anwarul Haq Kakar : పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. పుష్టున్ జాతి నాయకుడు అన్వరుల్ హక్ కాకర్, ఆర్థికసంక్షోభంలో ఉన్న దేశాన్ని నడపనున్నారు. తదుపరి సాధారణ ఎన్నికలను నిర్వహించడానికి పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. (Anwarul Haq Kakar sworn) ప్రెసిడెంట్ హౌస్‌లో జరిగిన ఒక సాధారణ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ 52 ఏళ్ల కాకర్‌తో ప్రమాణం చేయించారు. (Pakistan’s caretaker Prime Minister) ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు.

Tomatoes : ఆగస్టు 15 నుంచి రూ.50కి తగ్గిన టమాటాల ధర

అతను పాకిస్థాన్ 8వ తాత్కాలిక ప్రధాన మంత్రి అయ్యారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు చెందిన కకర్ ఎన్నికలను పర్యవేక్షించడానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతను సెనేటర్‌గా పనిచేశారు. కానీ ప్రధానమంత్రిగా నియమితులైన తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాకర్ ప్రధాన మంత్రి రాజభవన్ అధికారిక నివాసమైన ప్రధాని హౌస్‌కు వెళ్లారు. మాజీ కెరీర్ దౌత్యవేత్త జలీల్ అబ్బాస్ జిలానీని విదేశాంగ మంత్రిగా నియమించాలని భావిస్తున్నారు.