భూమికి దగ్గరగా దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం

భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) చక్కర్లు కొడుతూ..2020, జూన్ 06వ తేదీ శనివారం భూమికి దగ్గరగా రానుందని నాసా వెల్లడించింది. దీనికి రాక్ 1633 48 (2002 NN 4) పేరు పెట్టినట్లు తెలిపింది. సెకనకు 5.2 కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహ శకలం ప్రయాణిస్తోంది. గరిష్టంగా 1870 అడుగుల ఎత్తు ఉండవచ్చని అంచనా వేసింది. జూన్ 07వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12.50 గంటలకు భూమికి అత్యంత చేరువగా వచ్చే అవకాశాలున్నాయని..దాని కదలికలను నమోదు చేయడంపై ఫోకస్ పెట్టామని వివరించింది.
అమెరికాలో ఎంపైర్ బిల్డింగ్ కంటే ఎత్తైన విధంగా ఉండనుంది. న్యూ యార్క్ నగరంలో ఈ భవనం ఉంది. భవనంలో 102 అంతస్తులు, 1, 454 అడుగుల ఎత్తు ఉంది. 20, 000 mph కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ గ్రహ శకలం తాకితే..ఎక్కువ నష్టం కలుగ చేస్తుందని ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ విశ్వ విద్యాలయంలోని భౌతిక శాస్త్రవేత్త డెరెక్ బుజాసి వెల్లడించారు. దీనిని ఫుట్ బాల్ స్టేడియంతో పోల్చారు. భూగ్రహానికి ఎలాంటి ముప్పు లేదని, దీనిపై ఎవరూ పెద్దగా భయపడాల్సిన పనిలేదంటున్నారు మరికొంతమంది.
Read: జూన్ 05, 06 తేదీల్లో చంద్ర గ్రహణం..ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే