బేబీ ఫేస్ మాస్టర్ : ప్లీజ్..నన్ను టీచర్‌గా గుర్తించండి 

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 09:18 AM IST
బేబీ ఫేస్ మాస్టర్ : ప్లీజ్..నన్ను టీచర్‌గా గుర్తించండి 

Updated On : October 2, 2019 / 9:18 AM IST

టీచర్ అంటే ఇలాగే ఉండాలని ఎక్కడా లేదు. కానీ చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు చిన్నపిల్లాడిలా కాకుండా కాస్త పెద్దగా కనిపించాలి. అలా కనిపించకపోతే కష్టమే మరి. టీచర్ కూడా విద్యార్థిలా కనిపిస్తే నువ్వు టీచరా? లేక స్టూడెంటా అని కచ్ఛితంగా అడుగుతారు. ఇదిగో ఈ టీచర్ పరిస్థితి అలాగే ఉంది. చిన్నపిల్లాడిలా కనిపించే 23 ఏళ్ల ఈ టీచర్ ను అందరూ ఆటపట్టిస్తున్నారు. దీంతో ప్లీజ్..నన్ను టీచర్ గా గుర్తించండంటున్నారు. అంతేకాదు టీచర్ లా కనిపించేందుకు కళ్లజోడు పెట్టుకుని..పొడవాటి బట్టలు వేసుకుని వెళ్లున్నారు. మరి ఆ లిటిల్ టీచర్ విశేషాలేంటో తెలుసుకుందాం..

అది ఫిలిప్పీన్స్‌ లోని బులాకాన్ ప్రాంతం. అక్కడ సెన్‌జోస్‌డెల్ స్కూలు. ఆ స్కూల్లోనే పనిచేస్తున్నారు మన లిటిల్ మాస్టర్. అతని పేరు ఫ్రాన్సిస్ మాంగా. అతనికి 22 ఏళ్లు. కానీ ఆ వయస్సు ఉన్నట్లుగా అస్సలు కనిపించరు. గ్లామర్ వల్ల కాదు. 10, 12 ఏళ్ల పిల్లాడిలా కనిపిస్తారు ఫ్రాన్సిస్ మాంగా టీచర్. దీంతో అతను వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

మాంగా స్కూలల్లో పిల్లల మధ్యలో ఉంటే అతన్ని కూడా స్టూడెంటే అనుకుంటాం. అస్సలు గుర్తించలేం.  ఇతనే క్లాస్ టీచర్ అంటే అస్సలు ఎవ్వరూ నమ్మరు. ఏంటి జోక్ చేస్తున్నారా? అంటారు. లేదా ఇంత చిన్న వయస్సులో టీచర్ అయ్యావ్..సో గ్రేట్ అంటారు.  పాపం..ఇది మాంగాకు ఇబ్బందికరంగా మారింది. దీంతో టీచర్ గా కనిపించేందుకు ప్రత్యేకంగా తయారవుతున్నారు మాంగా. 

మాంగా ముఖం, జుట్టు, చేతుల పొడవు, తక్కువ బరువుగా ఉండటం వల్ల చిన్న పిల్లవాడి మాదిరిగా కనిపిస్తున్నాడు. పైగా మాంగాకు 23ఏళ్లు వచ్చినా మీసాలు కూడా మొలవలేదు. ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో డాక్టర్లకు దగ్గరు వెళ్లనేలేదు. 
ఈ సందర్భంగా మాంగా మాట్లాడుతూ చాలామంది తనను టీచర్ గా గుర్తించడంలేదంటూ వాపోయాడు. టీచర్ లా కనిపించేందుకు పొడవైన దుస్తులు వేసుకుంటున్నాననీ..అవసరం లేకపోయినా..కళ్లజోడు కూడా పెట్టుకుంటున్నానని..ఎత్తయిన చెప్పులు వేసుకుంటున్నానని తెలిపాడు. కానీ పాఠాలు చెప్పటంలో మాత్రం ఏమాత్రం తగ్గేది లేదనీ పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా చెబుతానని అంటున్నాడు. చిన్నారులకు రోల్ మోడల్‌గా ఉంటున్నానని తెలిపారు.
పిల్లలకు లెసన్స్ చెప్పేటప్పుడు  తాను గంభీరంగా మారిపోతానని, దీంతో విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉంటారని అన్నారు. తన తోటి ఉద్యోగులు కూడా తనను ఎప్పుడూ గేలి చేయలేదనీ..చాలా గౌవరంగా చూస్తుంటారని చెప్పాడు.కొంతమంది పిల్లలు మాత్రం చిలిపిగా ‘లిటిల్ బాయ్’ అంటూ ఆటపట్టిస్తుంటారని మాంగా నవ్వుతూ చెప్పారు.