గ్రహణం వల్ల ఈ రాశుల వారికి అరిష్టమా ?

  • Published By: chvmurthy ,Published On : December 17, 2019 / 12:44 PM IST
గ్రహణం వల్ల ఈ రాశుల వారికి అరిష్టమా ?

Updated On : December 17, 2019 / 12:44 PM IST

డిసెంబర్ 26న సంభవించే సూర్యగ్రహణం వల్ల  కొన్ని రాశులవారికి ఫ్రాణహాని అని, మరొక రాశివారికి ధననష్టం అని ఇంకో రాసివారికి మనో వ్యధ అనిచెపుతూ ఒక పోస్ట్ కొద్దిరోజులగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని జ్యోతిష్య పండితులు ఖండిస్తున్నారు. ప్రామాణికం లేని ఇలాంటి  పోస్ట్ లు దుష్ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచెయ్య వద్దని వారు కోరుతున్నారు.  ప్రపంఛ జనాభాలో ఎన్నో కోట్లమంది ఆరాశిలో జన్మించి ఉంటారని ….వారందరికీ నష్టం జరుగుతుందని  పోస్ట్ తయారు చేసినవారు చెప్పగలరా అని జ్యోతిష్యులు ప్రశ్నిస్తున్నారు.

గ్రహాణ సమయంలో పెద్దలు చెప్పిన జాగ్రత్తలు పాటించటం తప్ప భయపడాల్సిన అవసరం లేదని, జన్మ జాతకాల పైనే వారి యొక్క జీవిత ఫలితాలు ఆధార పడి ఉంటాయని వివరిస్తున్నారు. గ్రహణం వల్ల వ్యక్తులకు ఎటువంటి హానీ, నష్టం జరగదని,  ఏదైనా జరిగితే దేశంపై ప్రభావం ఉంటుందని చెపుతున్నారు.

గ్రహణ సమయంలో డైరెక్ట్ గా సూర్యుడిని చూసే ప్రయత్నం చేయవద్దని  సూచిస్తున్నారు. ఒక్క సెకను తేడాతో  పుట్టిన వారి జాతకాలే మార్పు ఉంటున్నప్పుడు  ఖగోళంలో జరిగే ఈ మార్పు వల్ల ఎవరికీ నష్టం  వాటిల్లదని జ్యోతిష్యులు భరోసా ఇస్తున్నారు. 

eclips effect on zodiac signs