India Pakistan Tensions: పాకిస్తాన్ కు మరో చావు దెబ్బ.. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసిన భారత్
పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది.

India Pakistan Tensions: పాకిస్తాన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్ పై దాడికి యత్నించిన పాక్ కు.. భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. పాక్ ను చావుదెబ్బ కొట్టింది. ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత్ ధ్వంసం చేసింది. ఊహించని విధంగా జరిగిన ఘటనతో పాక్ బిత్తరపోయింది.
భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా మిస్సైల్, డ్రోన్లతో దాడులకు యత్నించింది పాక్. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. వారి మిస్సైల్స్, డ్రోన్లను కూల్చేసింది. అంతేకాదు.. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది.
చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో మిస్సైల్స్, డ్రోన్లతో దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, అదామ్‌పుర్, భఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే.. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు భారత రక్షణశాఖ వెల్లడించింది. పాక్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది.
పాక్ దుశ్చర్యతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైంది.
Also Read: పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టాం, దెబ్బతీశాం- కల్నల్ సోఫియా ఖురేషి
పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లకు చెక్ పెట్టడమే కాదు.. ఆ దేశానికి దిమ్మతిరిగేలా దెబ్బకొట్టింది భారత్. ఇజ్రాయెల్ కు చెందిన Harop డ్రోన్లతో పాక్ ఎయిర్ డిఫెన్స్ స్టిస్టమ్ HQ9 ను తుక్కతుక్కు చేసింది భారత్. లాహోర్, సియాల్ కోట్ వరకు వెళ్లిన భారత డ్రోన్లు.. చైనా తయారు చేసిన HQ9 డిఫెన్స్ సిస్టమ్ ను సర్వనాశనం చేశాయి. లాహోర్ తో పాటు 9 పాకిస్తాన్ నగరాల్లో ( రావల్పిండి, లాహరో, గుర్జన్ వాలా, చక్ వాల్, అట్టోక్, బహవల్ పూర్, మియాన్ వలీ, కరాచీ, ఛోర్)
ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో అటాక్ చేసింది. ఇజ్రాయెల్ అందించిన Harop డ్రోన్లు పాకిస్తాన్ నగరాలపై వీరవిహారం చేశాయి. ఇజ్రాయల్ డ్రోన్ల దెబ్బకు పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకూ పనికి రాకుండా పోయింది.