ఈ బ్రిటన్ ప్రధాని కరోనావచ్చి బెడ్ ఎక్కాడు. కోలుకున్నాక ‘షేక్ హ్యాండ్’ చేశానంటూ గొప్పగా చెప్పుకొంటున్నాడు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ షేక్ హ్యాండ్ వ్యాఖ్యలపై సైంటిఫిక్ అడ్వైజర్లు వార్నింగ్ ఇచ్చారు. కరచాలనం చేయడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని 10 మంది శాస్త్రీయ సలహాదారులు హెచ్చరించారు. కరోనా వైరస్ సోకడంతో బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న ఇతర కరోనా పేషెంట్లలో ప్రతిఒక్కరితో తాను షేక్ హ్యాండ్ చేశానంటూ బోరిస్ ప్రగల్భాలు పలికారు. అదే రోజున సైంటిఫిక్ అడ్వైజర్లు.. ప్రజలు ఎవరూ షేక్ హ్యాండ్ ఇవ్వరాదని ప్రభుత్వమే చెప్పాలని హెచ్చరించారు.
ప్రభుత్వ Scientific Advisory Group for Emergencies (SAGE)కు చెందిన సబ్ గ్రూపు ఈ సలహాను ప్రభుత్వానికి సూచించింది. చేతి పరిశుభ్రత ప్రాముఖ్యతతో పాటు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఒకరినొకరు కౌగిలించుకుని విషెస్ చెప్పుకోవడం వంటి వాటికి ప్రజలందరూ దూరంగా ఉండేలా ప్రభుత్వం సలహా ఇవ్వాలని మార్చి 3న సేజ్ సూచనలు చేసింది. కరచాలనం చేయొద్దనే బహిరంగ సందేశంతో పాటు చేతి పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజెప్పాలని Independent Scientific Pandemic Influenza Group on Behaviours (SPI-B) తెలిపింది. షేక్ హ్యాండ్‌కు ప్రత్యామ్నాయ శుభాకాంక్షలను ప్రోత్సహించడం లేదా హ్యాండ్‌షేక్‌ను మర్యాదగా తిరస్కరించేలా ఇతరులను ప్రోత్సహించాల్సి అవసరం ఉందని పేర్కొంది.
అయితే, జాన్సన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు అక్కడి వారితో కరచాలనం చేస్తూనే ఉన్నాను. నేను ఒక రాత్రి ఆస్పత్రిలోనే ఉన్నాను, అక్కడ కొంతమంది కరోనా రోగులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో కరచాలనం చేసాను. అప్పటినుంచి నేను కరచాలనం చేస్తూనే ఉన్నాను’ అని జాన్సన్ ప్రగల్భాలు పలికారు. ఈ విషయంలో ప్రజలే తమ సొంతంగా నిర్ణయం తీసుకోగలరు. కానీ, శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. మీ చేతులు కడుక్కోవడమనేది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాను’ అని చెప్పారు. వాస్తవానికి బోరిస్ సందేశం ఏంటంటే? చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలనేది ఆయన అభిప్రాయం.
ప్రజారోగ్య సందేశం ఏమిటంటే.. ప్రజలు రెండుసార్లు హ్యాపీ బర్త్ డే పాడేటప్పుడు చేతులు కడుక్కోవాలన్నారు. అలా చెప్పిన రెండు రోజుల తర్వాత మార్చి 9న టెలివిజన్ ప్రెజెంటర్ ఫిలిప్ స్కోఫీల్డ్‌తో , బాక్సర్ ఆంథోనీ జాషువాతో బోరిస్ జాన్సస్ కరచాలనం చేశారు. దాదాపు 3 వారాల తరువాత మార్చి 27న జాన్సన్ కరోనావైరస్ ఉన్నట్లు తేలింది. రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్‌తో సహా ఇతర జాగ్రత్తలను పీఎం తీసుకున్నారని, అధికారిక సలహాతోనే ఆయన తన మనస్సును మార్చుకున్నారని ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Also Read | దుకాణాలను తిరిగి తెరవడం వల్ల కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు వేగవంతం కాలేదు, శుభవార్త చెప్పిన ఆస్ట్రియా ప్రభుత్వం