బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది.

Boris Johnsons India Visit Next Week Cancelled Due To Covid 19
Boris Johnson బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది. ఏప్రిల్-25 భారత పర్యటనకు బోరిస్ జాన్సన్ రావాల్సి ఉండగా..ప్రస్తుతం భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఈ నెలాఖరులో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్చువల్‌గా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలో భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బోరిస్ జాన్సన్…అప్పుడు బ్రిటన్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాయిదావేసుకున్నారు. దీంతో ఈ నెల చివరి వారంలో ఆయన భారత్‌లో పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, బ్రిటన్ ప్రభుత్వం సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది చివరిలో ఇరుదేశాల ప్రధానమంత్రులు సమావేశమై భారత్-బ్రిటన్ భవిష్యత్తు భాగస్వామ్యంపై చర్చిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.