పిచ్చుకపై బ్రహ్మాస్త్రం : బొద్దింకల్ని చంపటానికి గ్యాస్ బాంబులేసి..  

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 07:12 AM IST
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం : బొద్దింకల్ని చంపటానికి గ్యాస్ బాంబులేసి..  

Updated On : October 26, 2019 / 7:12 AM IST

ఇంట్లో బొద్దికలు ఉంటే హిట్ లాంటివాటిని కొట్టి చంపేస్తాం.లేదా వేరే ఏమైనా చేస్తాం. కానీ బొద్దింకల్ని చంపేందుకు ఎవరైనా బాంబులు వేస్తారా? కానీ భార్య మీద  ఉన్న అధిక ప్రేమతో ఓ భర్త చేసిన పనికి పేలుడు సంభవించింది. మరి భార్యా ప్రేమికుడు బొద్దంకల హంటింగ్ గురించి..
అది దక్షిణ బ్రెజిల్‌లోని ఎనాస్ మార్క్యూస్‌. ఆ భర్త పేరు సెసార్ షుమిట్జ్. వయస్సు  48. ఆయన ఇంట్లో గార్డెన్ లోకి బొద్దింకలు వచ్చాయి. వాటిని చూసి సెసార్ భార్య చిరాకుపడింది. బొద్దింకటే నాకు చాలా చాలా చిరాకు. వాటిని మీరు పోగొట్టలేరా? అవి మరోసారి నాకు కనిపించాయంటే ఊరుకునేది లేదంటూ భార్య ఆర్డర్ వేసింది. ఇంకేమంది భార్య అంటే ప్రేమ ఉన్నవారు బొద్దింకల్ని నాశనం చేయకుండా ఎలా ఉంటారు అనే లెవెల్లో సెసార్ బొద్దింకల హంటింగ్ స్టార్ చేశాడు. 
డార్లింగ్ డోంట్ వర్రీ..నేనున్నాగా నేను చూసుకుంటా అంటూ బొద్దింకల్ని చంపేందుకు రంగంలోకి దిగాడు. లాన్ లో ఉన్న బొద్దింకలపై ప్రతాపం చూపించాడు. లాన్ లోని గడ్డిలో  ఓ కన్నంలో ఉన్న బొద్దింకలపై  గ్యాసోలిన్ వచ్చేలా చేశాడు. కానీ ఫలితలం లేకపోయింది. లా రెండు మూడు సార్లు ట్రై చేశాడు. ఛీ..బొద్దింకల్ని నాశనం చేయటం కూడా మీకు రాదా అంటూ భార్య అనేసరికి గురుడికి బొద్దింకలపై కోపం నషాళానికి అంటుకుంది. అలా బొద్దింకలు ఉన్న కన్నంలోకి గ్యాసోలిన్ వచ్చేలా చేసి అగ్నిపుల్ల వెలిగించి వేశాడు. అంతే ఒక్కసారిగా లాన్ మొత్తం పేలిపోయింది. పచ్చని గడ్డితో సహా మట్టి  పైకి లేచింది. 

ఆ పేలుడు ధాటికి అక్కడే  ఉన్న కుక్కలు అద్దిరిపడ్డాయి. ఏం జరిగిందే వాటికి అర్థం కాక ఒక్కసారి మొరిగాయి.  అక్కేడే ఉన్న టేబుల్ గాల్లోకి ఎగిరిపడింది. ఇదంతా అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే..ఇంత చేసినా బొద్దింకలు మాత్రం చావలేదు. ఓ బొద్దింక అతని వెనక నుంచీ వెళ్లింది. మమ్మల్ని చంపటం నీ వల్ల కాదు..నీ తాతల వల్లా కాదు అన్నట్లు వీడియోలోచూడొచ్చు.

ఈ వీడియో వైరల్ గా మారింది. లక్షల మంది ఒకటికి రెండుసార్లు చూసి…రకకరకాలుగా కాంమెంట్స్ చేశారు. పాపం సెసార్ మాత్రం లాన్ ను మళ్లీ సెట్ చేసుకున్నాడు. పచ్చగా ఉండేందుక మరోసారి గడ్డి మొలిచేలా చేసుకున్నాడు. ఇటువంటి ఘటన 2018లో కాలిఫోర్నియాలో కూడా జరిగింది. ఇంట్లో ఉన్న సాలెపురుగుల్ని చంపేందుకు మొత్తం ఇంటిని తగలబెట్టుకున్నాడు ఓ యజమాని. ఇరిటేషన్ తెచ్చే ఇబ్బందులు సమస్యలుగా మారతాయి. ఇదిగో ఇటువంటి సందర్భాల్లో..సో..బీ కూల్..సమస్యకు సొల్యూన్ వెతకాలి తప్ప ఇరిటేట్ అవ్వొద్దు..లేకంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.