బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2020 / 11:28 AM IST
బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్

Updated On : March 27, 2020 / 11:28 AM IST

దేశాధినేతలను సైతం కరోనా వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా(COVID-19) సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు కరోనా టెస్ట్  చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో ప్రధాని బోరిస్ కు కరోనా సోకినట్లు తేలింది. బోరిస్..డౌనింగ్ స్ట్రీట్ లోని తన ఇంట్లో ఐసొలేట్ అవనున్నారు. కరోనా సంక్షోభాన్ని హ్యాండిల్ చేస్తున్న ప్రభుత్వ ఇన్ చార్జ్ గా బోరిస్ ఉంటారని ఓ ప్రకటనలో డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. ఇప్పటికే బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2,ఆమె కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

గడిచిన 24గంట్లలో తనలో కరోనా లక్షణాలు మెల్లగా బయటపడ్డాయని,తనకు కరోనా సోకిందని స్వయంగా ప్రధానమంత్రి బోరిస్ జాన్స్ ఓ వీడియోలో తెలిపారు. ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్ లో షేర్ చేశారు. తాను ఇప్పుడు స్వయంగా ఐసొలేట్ అయ్యానని బోరిస్ తెలిపారు. ఈ వైరస్ పై తాము ఫైట్ చేస్తున్నట్లుగానే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ బాధ్యతలను లీడ్ చేయడం కొనసాగిస్తానని బోరిస్ జాన్సన్ తెలిపారు.

వైద్య అధికారులకు మరియు సాధారణ ప్రజలకు బోరిస్ జాన్సన్(55) కృతజ్ఞతలు తెలిపారు. చర్యలను సక్రమంగా పాటిస్తే, UK కరోనా అంటువ్యాధి నుంచి బయటపడి తిరిగి బలంగా పుంజుకుంటుందన్నారు. నేను కొనసాగగలనని ఎటువంటి సందేహం లేదు. కరోనావైరస్ కు వ్యతిరేకంగా జాతీయ పోరాటంలో నాయకత్వం వహించడానికి నా బృందంతో కమ్యూనికేట్ చేసే మోడ్రన్ టెక్నాలజీ యొక్క మేజిక్ కు కృతజ్ఞతలు అని బోరిస్ అన్నారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. బ్రిటన్ లో ఇప్పటివరకు 11వేల 658మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. 578 కరోనా మరణాలు నమోదయ్యాయి. 135మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

Also Read | తెలంగాణలో ఒక్కరోజే 10 పాజిటివ్.. 59కి చేరిన కేసులు: కేసీఆర్