బ్రిటన్ లో ఎన్నికలు! : బ్రెగ్జిట్ బిల్లును తిరస్కరించిన పార్లమెంట్

ఈరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు రావాలనుకొని బ్రిటన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈయూతో కుదరుర్చుకొన్న బప్పందంపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రవేశపెట్టిన బిల్లు(బ్రెగ్జిట్)ను బుధవారం(జనవరి 16,2019) బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరించింది. 230 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ ఎంపీలు తిరస్కరించారు. బుధవారం జరిగిన ఓటింగ్ లో 432మంది సభ్యులు బిల్లకు వ్యతిరేకంగా ఓటేయగా, అనుకూలంగా 202మంది ఎంపీలు ఓటేశారు.
ఎంపీల నిర్ణయంతో థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. థెరిసా మే విజ్ణప్తిని ఎంపీలెవరూ పట్టించుకోలేదు. బిల్లు వీగిపోవడంతో థెరిసా మేపై ప్రతిపక్ష లేబర్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే బ్రిటన్ లో ఎన్నికలు జరుగనున్నాయి.
బ్రెగ్జిట్ కోసం ఈయూతో బ్రిటన్ కుదుర్చుకొన్న ఒప్పందాన్ని ఈయూ సభ్య దేశాల నేతలు ఇప్పటికే ఆమోదించారు. అయితే బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ మాత్రం ఆమోద ముద్ర వేయలేదు.
థెరిసా ఈయూతో కుదుర్చుకొన్న ఒప్పందంపై సొంతపార్టీ నేతలే ఆమెపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఆమె నిర్ణయం బ్రిటన్ కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమెపై విమర్శలు చేస్తూ మంత్రివర్గ సభ్యులు కొందరు రాజీనామా కూడా చేసి ఆమెపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అయితే ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరని థెరిసా మే వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఎంపీలు ఆముకు వ్యతిరేకంగా ఉన్నారు.