ఓరి నాయనో..ఇది పిల్లేనా..హార్రర్ మూవీలో దెయ్యామా! చూస్తే గుండెలద్దిరిపోతాయ్!!

కొన్ని పిల్లులు చాలా క్యూట్‌గా ఉంటాయి. కొన్ని పిల్లులు గంభీరంగా భారీ సైజులో ఉండి ఇది పిల్లా? పులా అనిపించేలా ఉంటాయి. కానీ ఇదిగో ఇక్కడ కనిపించే పిల్లిని చూస్తే..ఇది నిజంగా పిల్లేనా..దెయ్యమా?..లేదా సైన్స్ ఫిక్షన్ లో చూపించే వింతజీవా? అనుకుంటారు.
ఈ పిల్లిని మనం చూసినా..అది మనల్ని చూసినా నిద్రలో కూడా ఉలిక్కి పడతాం. అంత వింతగా..చెప్పటానికి బాధగా ఉన్నా అంత భయంకరంగా ఉంటుంది. ఇంత వింత రూపంలో ఉండే ఈ పిల్లికి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది.దానికి దాని ఆకారమే కారణం. దీని కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందీ అంటే ఈ పిల్ల ఎంత ఫేమస్తే ఊహించుకోవచ్చు. ఇంతకీ ఈ పిల్లి ఎక్కడుంది? ఎందుకలా తెలుసుకోవాలని ఉంది కదూ..
మిడిగుడ్లు వేసుకుని..భయంకకంగా..గంభీరంగా చూస్తున్న ఈ పిల్లి పేరు క్సెర్డన్.. దీనికి ఆరు సంవత్సరాలు. స్విట్జర్లాండ్‌లోని రూటీలో ఉంటుంది.సాండ్రా ఫిలిప్పి పెంచుకుంటున్నారు. ఈ పిల్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా పేజీ కూడా ఉంది. అంతేకాదండోయ్…దీనికి 22 వేలకు పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఈ పిల్లి ఇలా ఎందుకుందో తెలుసుకుందాం..
పిల్లులకు ఒంటి నిండా వెంట్రుకలుంటాయి. కానీ ఈ క్సెర్డన్ కు మాత్రం ఒంటిమీద ఒక్క వెంట్రుక కూడా ఉండదు. అది పుట్టటమే అలా పుట్టింది. దానితోపాటు పుట్టిన పిల్లులు మామూలు పిల్లుల్లా పుట్టాయి. కానీ ఇది మాత్రం ఇలా వింతగా పుట్టింది. ఈ పిల్లి అందరికీ వింతగా..భయంకరంగా.. కనిపిస్తున్నా..దాని యజమాని 47 ఏళ్ల శాండ్రా ఫ్లిప్పీకు మాత్రం చాలా అందంగా కనిపిస్తుందట.‘‘నా క్సెర్డన్ అంత అందమైన స్వీట్ అండ్ క్యూట్ క్యాట్ ప్రపంచంలోనే లేదు అని మురిసిపోతుంటారు.
See Also | భారత్‌లో కరోనా : పెరుగుతున్న కేసులు..వీసాలు రద్దు..హెల్ప్ లైన్ నెంబర్