Most Viewed Photo : ప్రపంచంలోనే ఎక్కువమంది చూసిన ఫోటో ఎవరు తీశారో తెలుసా?

కొన్ని ఫోటోలు చూడగానే మన మనసుని హత్తుకుంటాయి. ఎవరో తీశారో గానీ ఎంత బాగా తీశారో అని మెచ్చుకుంటాం. ప్రపంచంలోనే ఎక్కువమంది చూసి ఇష్టపడిన ఫోటో మరోసారి చూస్తారా.. అది తీసింది ఎవరో కూడా తెలుసుకోవాలని ఉందా?

Most Viewed Photo : ప్రపంచంలోనే ఎక్కువమంది చూసిన ఫోటో ఎవరు తీశారో తెలుసా?

Most Viewed Photo

Updated On : April 11, 2023 / 5:32 PM IST

Most Viewed Photo : ఫోటోలు తీయడం.. దిగడం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. కొన్ని ఫోటోలు మనకి నచ్చి మన కంప్యూటర్ మీద.. మొబైల్ ఫోన్ల మీద వాల్ పేపర్లుగా (wallpapers) కూడా పెట్టేసుకుంటాం. అలా మీకు ఎంతో పరిచయం ఉన్న ఓ ఫోటో గురించి చెప్పాలి. ఈ ఫోటో ఖచ్చితంగా మీ కంప్యూటర్ వాల్ మీద వాడే ఉంటారు.

Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్

Windows XP వాడిన వాళ్లకు ఈ ఫోటో గురించి పరిచయం చేయనక్కర్లేదు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫాల్ట్ వాల్ పేపరే “బ్లిస్” (bliss). దీన్ని చూడగానే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. పచ్చని పచ్చికబయలు, నీలిరంగు ఆకాశంలో తెల్లగా పరిచిన మేఘాలు చూడగానే ముచ్చట గొలిపే ఫోటో ఇది. 2000 లో ఈ వాల్‌పేపర్ ని అందరూ వాడే ఉంటారు. అయితే ఈ ఫోటోకి ఒక చరిత్ర ఉంది.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

ఈ ఫోటో ప్రపంచంలోనే అత్యధికులు వీక్షించిన ఫోటోగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ ఫోటో ఎవరు తీశారు? అనేది చాలామందికి తెలియదు. 1996లో చార్లెస్ ఓ రియర్ (Charles O’Rear) అనే వ్యక్తి ఈ ఫోటోని తీశారు. అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ (Microsoft) ఈ ఫోటో హక్కుల్ని కొనేసింది. ఈ ఫోటోని వరకు బిలియన్ల సంఖ్యలో జనం చూసారని ఇప్పుడు అంచనా వేశారు. గతంలో చార్లెస్ మారిన్ కౌంటీకి (Marin County) వెళ్లినప్పుడు ఈ ఫోటోని తీశాడు. 20 సంవత్సరాల తర్వాత తన భార్య డాఫ్నే లార్కిన్‌తో (Daphne Larkin) కలిసి మరల అదే ప్రదేశానికి వెళ్లినప్పుడు అప్పటి ఫోటో ఫ్రేమ్ ను వెంట తీసుకెళ్లాడు చార్లెస్. అలా ఈ ఫోటో, చార్లెస్ మరలా వార్తల్లోకి వచ్చారన్నమాట.