New York : తల్లిదండ్రులకు పెళ్లిరోజున ఓ చిన్నారి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?

తల్లిదండ్రుల పెళ్లిరోజున ఓ చిన్నారి ఇచ్చిన సర్ప్రైజ్ చూసి వేడుకకు వచ్చిన అతిథులు, రెస్టారెంట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసాడు?

New York : తల్లిదండ్రులకు పెళ్లిరోజున ఓ చిన్నారి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?

New York

Updated On : October 17, 2023 / 5:55 PM IST

New York : న్యూయార్క్ లోని ఓ రెస్టారెంట్‌లో 7 ఏళ్ల చిన్నారి 1959 నాటి ఓ హిట్ సాంగ్‌ను అద్భుతంగా పాడాడు. తల్లిదండ్రుల పెళ్లిరోజు వేడుకకు వచ్చిన వారినే కాదు హోటల్ సిబ్బందిని మెస్మరైజ్ చేసాడు.

Shashi Tharoor : అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్ .. కేరళ స్టైల్ దాండియా.. అంటూ కాంగ్రెస్ నేత శశీథరూర్ ట్వీట్ వైరల్

అమెరికాలోని న్యూయార్క్ స్టేటెన్ ఐలాండ్‌లోని పాణిని గ్రిల్ రెస్టారెంట్.. మార్సెల్లో అనే 7 ఏళ్ల చిన్నారి బాబీ డారిన్ పాడిన ‘బియాండ్ ది సీ’.. అంటూ పాటందుకున్నాడు. 1959 నాటి హిట్ సాంగ్ పాడి అందరి మనసు దోచుకున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

మార్సెల్లో తన పేరెంట్స్ పెళ్లిరోజు సందర్భంలో ఫ్యామిలీతో కలిసి వేడుక జరుపుకోవడానికి రెస్టారెంట్‌కి వచ్చాడు. ఈ సందర్భంలో తన పేరెంట్స్‌కి  సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. మార్సెల్లో రెస్టారెంట్ అంతా తిరుగుతూ అందరినీ ఉత్సాహ పరుస్తూ పాట అందుకున్నాడు. ఇక మార్కెల్లో ప్రతిభను, ఉత్సాహాన్ని చూసిన అతిథులు, రెస్టారెంట్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. చప్పట్లతో అభినందించారు. majicallynews అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Allu Arjun : నేషనల్ అవార్డు అందుకోవడానికి బయలుదేరిన అల్లు అర్జున్.. పిక్స్ వైరల్..!

‘ 7 ఏళ్ల మార్సెల్లోకి పాడటం అంటే ఎంతో ఇష్టం. తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవ వేడుకలో ‘బియాడ్ ది సీ’ అనే పాట పాడుతూ తన తల్లిదండ్రులకు సర్ప్రైజ్  ఇవ్వాలనుకున్నాడు. తన పాటతో మొత్తం రెస్టారెంట్‌ను ఆకర్షించాడు’ అనే శీర్షికతో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చాలామంది అతని తల్లిదండ్రులకు గొప్ప బహుమతి అంటూ కామెంట్స్ చేసారు.

 

View this post on Instagram

 

A post shared by ????????? ???? (@majicallynews)