ఇండియాతో టెన్షన్లు దాటేసేందుకు చైనా-పాకిస్తాన్‌ మిలటరీ ఒప్పందం

  • Published By: Mahesh ,Published On : December 1, 2020 / 08:33 PM IST
ఇండియాతో టెన్షన్లు దాటేసేందుకు చైనా-పాకిస్తాన్‌ మిలటరీ ఒప్పందం

Updated On : December 1, 2020 / 9:01 PM IST

China and Pakistan: చైనా, పాకిస్తాన్ ఇరు దేశాల మిలటరీ బలగాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచేవిధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని చైనా డిఫెన్స్ మినిష్టర్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ జనరల్ వీ ఫెంగ్ వెల్లడించారు. రావల్పిండిలోని పాకిస్తానీ ఆర్మీని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ నిర్థారించారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో చర్చించినట్లు వివరించారు. సంయుక్తంగా ఇంటరెస్ట్ ఉండటంతో పాటు ప్రాంతీయ భద్రతల కారణంగా మిలటరీ బలగాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరిగిందని అన్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి కూడా చర్చించామని అన్నారు.

 

 

స్నేహపూర్వకమైన సంబంధాలు బలపడాలని భవిష్యత్ లోనూ ఇలాగే కొనసాగాలని ఇరు దేశాల అధికారులు అనుకున్నారట.

నేపాల్ పర్యటన:
జనరల్ వీ నేపాల్ లోనూ పర్యటించి.. ప్రెసిడెంట్ ఎలెవన్ జిన్ పింగ్ తర్వాత నేపాల్ ను సందర్శించి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన రెండో వ్యక్తిగా రికార్డు అయ్యాడు. అక్కడి చర్చల్లో ప్రెసిడెంట్ బిద్య దేవీ, ప్రధాని కేపీ శర్మ ఓలీ పాల్గొన్నారు. ఇరు వర్గాలు ఎకనామిక్ కోఆపరేషన్, రోడ్ ఇనీషియేటివ్, మిలటరీ తదితర అంశాలపై చర్చించాయి.

ఆర్థికంగా పాకిస్తాన్‌తో లావాదేవీలన్నింటినీ తెగదెంపులు చేసుకున్న ఇండియా.. కొద్ది నెలల క్రితమే డేటా దుర్వినియోగం జరుగుతుందని చైనాతోనూ లింకులు బ్రేక్ చేసుకుంది.