China secret jail: దుబాయ్‌లో చైనా సీక్రెట్ జైలు.. వారిని ఉంచడానికి మాత్రమే
దుబాయ్ లోని చైనా నిర్వహిస్తున్న సీక్రెట్ జైలులో గడిపిన ఓ చైనా యువతి తాను ఎనిమిది రోజుల పాటు అక్కడే ఉన్నానని చెప్తుంది.

China Secret Jail
China secret jail: దుబాయ్ లోని చైనా నిర్వహిస్తున్న సీక్రెట్ జైలులో గడిపిన ఓ చైనా యువతి తాను ఎనిమిది రోజుల పాటు అక్కడే ఉన్నానని చెప్తుంది. ఒక్కో సెల్ లో కనీసం ఇద్దరు టర్కీకి చెందిన (Uyghurs) వాళ్లు ఉండేవారని వెల్లడించింది. సరిహద్ధుల వెలుపల చైనా నిర్వహిస్తున్న బ్లాక్ సైట్ అనడానికి తొలి సాక్ష్యం దొరికినట్లు అయింది.
26ఏళ్ల వూ హాన్ కు చెందిన యువతి.. చైనాకు తిరిగి పారిపోవాలని ప్రయత్నించి దుబాయ్ లోని ఓ హోటల్ లో పట్టుబడింది. మళ్లీ తీసుకెళ్లి అదే జైలు వేశారు. అప్పుడు ఆమెతో పాటు ఇద్దరు ఉఘర్స్ కూడా ఉన్నారని ఆమె చెప్పింది. అంతేకాకుండా ఆమెను ప్రశ్నించి బలవంతంగా లీగల్ డ్యాక్యుమెంట్ల మీద ఏవో సంతకాలు చేయించుకున్నారట. అక్కడి నుంచి విడుదలై ప్రస్తుతం నెదర్లాండ్స్ లో నివాసం కోసం ప్రయత్నిస్తుంది.
ఇటువంటి బ్లాక్ సైట్స్, సీక్రెట్ ప్రదేశాలనేవి చైనాలో కామన్. వూ హాన్ కు చెందిన యువతిని మరో దేశంలో సీక్రెట్ గా ఉంచడం లాంటి విషయంతోనే అది తెలిసిపోతుంది. అవినీతి పరులను, కొందరు మైనారిటీలను ఇలా చూస్తుందంటూ చైనా ప్రభుత్వంపై వార్తలు వినిపిస్తున్నాయి.
బాధిత మహిళ చైనాలో ఉండే బ్లాక్ సైట్ గురించి ఎటువంటి అడ్రస్ ను క్లియర్ గా చెప్పలేదు. ఆమె పాస్‌పోర్ట్‌పై స్టాంపులు, చైనా అధికారి మాట్లాడినప్పటి ఫోన్ రికార్డింగులు వీటికి సాక్ష్యాలని చెప్తుండగా.. చైనా, దుబాయ్ ప్రభుత్వాలు మాత్రం దీనిపై ఎటువంటి స్పందన కనబర్చలేదు.
చైనా ఇంటర్నేషనల్ లీగల్ యాక్షన్లను పర్యవేక్షించే యూ జీ చెన్ అనే వ్యక్తి మాత్రం ఇటువంటి ఫెసిలిటీ ఒక దేశం గురించి మరొక దేశంలో జైలు ఉంటుందంటే నమ్మశక్యంగా లేదు. కొందరిని మాత్రం చెైనాకు అప్పగిస్తారు లేదంటే పంపించేస్తారు. ఇవన్నీ దాదాపు ముస్లిం మైనారిటీల్లో జరుగుతుంటాయి. ప్రత్యేకించి కొందరు మతపరంగా వచ్చినట్లు చెప్పుకొని అక్రమాలకు పాల్పడినవారిని అదుపులోకి తీసుకుని తిరిగి చైనా పంపించేస్తామని వెల్లడించారు.
దుయాబ్ లో Uyghursను విచారించడానికి ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి. వారిని ఇంటరాగేట్ చేసిన తర్వాత తిరిగి చైనాకు పంపించేస్తారు. అలాకాకుండా దుబాయ్ లోనే ఉంచారంటే అది సీక్రెట్ ఇంటరాగేసన్ అయి ఉండాలి. అని చెన్ చెబుతుంటే.. ఖైదుగా ఉండి విడుదలైన మహిళ మాత్రం అక్కడి విల్లాల్లో కెనడాకు చెందిన డజన్ న్యద్దీ కెనడియన్లు, జోర్డాన్లు కూడా ఉన్నారు.