ఎంత శాంతివంతమైన దేశమో : పాక్ పై చైనా ప్రశంసలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2019 / 02:37 AM IST
ఎంత శాంతివంతమైన దేశమో : పాక్ పై చైనా ప్రశంసలు

Updated On : March 8, 2019 / 2:37 AM IST

మరోసారి తన నిజస్వరూపాన్ని చైనా బయటపెట్టింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పాక్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్న సమయంలో చైనా ఉప విదేశాంగ శాఖ మంత్రి కాంగ్ జున్ యు పాక్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చైనా పర్యటనలో పాక్ పై ప్రశంసల జల్లు కురింపించారు కాంగ్ జున్ యు. భారత్ తో యుద్ధవాతావరణం నెలకొన్నప్పటికీ మొదటి నుంచి పాక్ చాలా సంయమనం పాటిస్తుందని,చైనా-పాక్ లు ఎల్లప్పుడూ మిత్రులని,వ్యూహాత్మక భాగస్వాములని,ఒకరికొరకు సహరించుకుంటారని కాంగ్ పాక్ ను ప్రశంసినట్లు గురువారం(మార్చి-7,2019)చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్-పాక్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్ ఇస్లామాబాద్ పర్యటన ముఖ్య ఉద్దేశమని,ఉద్రిక్తతల నివారణకు కృషిచేస్తామని కాంగ్ అన్నట్లు తెలిపింది.
Also Read : నేడు పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు

ఈ వ్యాఖ్యలకు స్పందించిన పాక్‌ ప్రభుత్వం చైనాకు ధన్యవాదాలు తెలిపింది. భారత్-పాక్ లు ఎటువంటి యుద్ధానికి తలపడకుండా వీలైనంత త్వరగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కాంగ్ అన్నట్లు తెలిపింది. ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా,విదేశాంగ శాఖ మంత్రి షా మెహమ్మద్ ఖురేషితో కాంగ్ సమావేశమైనట్లు తెలిపింది.

పుల్వామా ఉగ్రదాడితో సహా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే ఉగ్రసంస్థను చైనా వెనకేసుకొస్తున్న విషయం తెలిసిందే. జైషే చీఫ్ మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని ఐరాసలో భారత ప్రయత్నాలకు చైనా తన వీటో అధికారంతో అడ్డుపడుతున్న విషయం తెలిసిందే.
Also Read : ఏం జరిగింది : ప్రీతిరెడ్డి హత్య కేసులో వీడని చిక్కుముడి