Lockdown In Guangzhou : చైనాలోని ఆ సిటీలో మళ్లీ లాక్ డౌన్
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

China Reports Surge Of New Covid 19 Cases In Guangzhou City Triggering Flight Cancellations Lockdowns
Lockdown In Guangzhou చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దక్షిణ చైనా నగరమైన గ్వాంగ్జోలో దాదాపు 30 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ..తగ్గినట్టే తగ్గి మళ్లీ రావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడి తర్వాత మరోసారి ఇలా కేసులు రావడం వల్ల ఆ ప్రాంతం ప్రస్తుతం హాట్‌స్పాట్‌గా మారింది. దీంతో అక్కడి ప్రభుత్వం గ్వాంగ్జోలో లాక్ డౌన్ ఆంక్షలు విధించింది. మార్కెట్లు,స్కూళ్లు,వినోద ప్రదేశాలను మూసివేశారు. మాస్ టెస్టింగ్ కు సిటీ గవర్నమెంట్ సిద్దమైంది. గ్వాంగ్జో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ప్రయాణానికి 72 గంటల్లోగా టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాత్రి నుంచి ఈ ట్రావెల్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చేవరకు అందరూ ఇంట్లోనే ఉండాలని చైనా ప్రభుత్వం అక్కడి ప్రజలను కోరింది. వైరస్ వ్యాప్తి చాలా వేగంగా మరియు బలంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నట్లు చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఇది కొత్త వేరియంట్ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కొత్త వేరియంట్ ఉనికిని గుర్తించేందుకు పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపింది.
కరోనా వ్యాప్తి మళ్లీ మొదలైందని భావిస్తున్న లివాన్ జిల్లాలో మార్కెట్లు, రెస్టారెంట్లు మూసివేశారు. బహిరంగ కార్యక్రమాలపైనా, సాంస్కృతిక కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించారు. కేవలం నిత్యావసరాలు,సరుకులు కొనుగోలు చేసేందుకే ఇళ్ల నుంచి బయటకి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చేవరకు అందరూ ఇంట్లోనే ఉండాలని చైనా ప్రభుత్వం అక్కడి ప్రజలను కోరింది.