స్పేస్‌లోకి తొలి asteroid mining robot పంపనున్న China

ప్రపంచపు తొలి ఆస్టరాయిడ్ మైనింగ్ రోబోను స్పేస్ లోకి పంపనుంది CHINA. ఈ సంవత్సరం నవంబరులో పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రైవేట్ బీజింగ్ కంపెనీకి చెందిన రోబోను Asteroid mining robot అంటున్నారు. IEEE స్పెక్ట్రమ్ రిపోర్ట్ ప్రకారం.. నవంబరు 2020కల్లా పంపాలనేదే ప్లాన్. నిజానికి రోబో మైనింగ్ పనులేమీ చేయదు.
ఇది ప్రిలిమినరీ అస్సెస్‌మెంట్ గా ఉపయోగపడుతుంది. ఆస్టరాయిడ్ మైనింగ్ రోబో క్యాపబిలిటీలు గుర్తించడానికి, విలువైన వనరుల గురించి తెలుసుకోవడానికి.. ఆస్టరాయిడ్స్ ను గుర్తించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ 30 గ్రాముల స్పేస్ క్రాఫ్ట్, NEO-1 చైనీస్ లాంగ్ మార్చ్ రాకెట్ మీద సెకండరీ పే లోడ్ కింద లాంచ్ చేయనున్నారు. భూమిపై ఉన్న 500కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుంది.
యూఎస్ మ్యాగజైన్ లో ఆరిజన్ స్పేస్ కో ఫౌండర్ యు టియోహాంగ్ ఇలా చెప్పింది. ‘నిర్థారించడానికి, మల్టిపుల్ ఫంక్షన్ల గురించి వివరించడమే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిటల్ మానోవర్ గోల్. చిన్న సెలెస్టియల్ బాడీ క్యాప్చర్, ఇంటిలిజెంట్ స్పేస్ క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ కంట్రోల్’ గురించి చెప్పడమే దీని పని.
ఇప్పటివరకూ ప్రయత్నించని మిషన్‌ను NEO-1 మొదలుపెట్టింది. ఇంతకుముందెప్పుడూ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ఒకవేళ సక్సెస్ అయితే.. ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్పేస్ రిసోర్సెస్ ఇండస్ట్రీలో ఇదొక మైలురాయిగా నిలవనుంది. మరో చైనీస్ కంపెనీ యువాన్‌వాంగ్-1 నిక్ నేమ్ లిటిల్ హబుల్. ఇది 2021 చివరి నాటికి గానీ 2022ఆరంభంలో కానీ, మొదలుపెట్టనున్నారు.