కరోనా ఎఫెక్ట్‌తో కండోమ్‌ల కొరత

  • Published By: vamsi ,Published On : March 28, 2020 / 07:32 AM IST
కరోనా ఎఫెక్ట్‌తో కండోమ్‌ల కొరత

Updated On : March 28, 2020 / 7:32 AM IST

ఫార్మా సేల్స్, ఈ కామర్స్ ద్వారా జరుగుతున్న అమ్మకాలను గమనిస్తే దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఇటీవల కండోమ్ సేల్స్ బాగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. క‌రోనా వైర‌స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కండోమ్‌ల ఉత్ప‌త్తి ఘననీయంగా త‌గ్గిపోయింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో కండోమ్‌ల‌ను ఉత్ప‌త్తి చేసే మలేషియాకు చెందిన కారెక్స్ Bhd( KARE.KL) సంస్థ ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేసింది.  

మ‌లేషియాకు చెందిన ఈ సంస్థ వారం రోజుల నుంచి ఒక్క కండోమ్‌ను కూడా ఉత్ప‌త్తి చేయ‌లేదు. ఆ సంస్థకు చెంది మూడు ఫ్యాక్ట‌రీలు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా మూసివేయడంతో 100 మిలియన్ కండోమ్‌ల కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అయిదుగురిలో ఒక‌రు వినియోగించేది ఆ కంపెనీ కండోమ్లు కావడంతో ఇప్పుడు ప్రపంచంలో కండోమ్‌ల కొరత కనిపిస్తుంది. 

క్లిష్టమైన పరిశ్రమలకు ప్రత్యేక మినహాయింపు కింద శుక్రవారం(27 మార్చి 2020) ఉత్పత్తిని పున: ప్రారంభించడానికి కంపెనీకి అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే 50శాతం మంది పనిచేసేవారు కరోనా భయంతో కార్మాగారానికి రాకపోవడంతో సగం సామర్థ్యంతో డిమాండ్‌ను కొనసాగించడానికి కష్టపడుతున్నారు కంపెనీ ప్రతినిధులు. మ‌లేషియాలో ఇప్ప‌టి వ‌ర‌కు  మూడు వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 26 మంది మ‌ర‌ణించారు.