Corona : ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. గతవారం మొత్తం 36 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది.

Who
Corona cases and deaths declining : ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఊరటనిచ్చేవిషయం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది.
గతవారం మొత్తం 36 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అంతకుముందు వారంతో పోలిస్తే సుమారు 4 లక్షల కేసులు తగ్గాయని తెలిపింది. ప్రధానంగా పశ్చిమ ఆసియాలో 22శాతం, ఆగ్నేయాసియాలో 16శాతం మేర కేసులు తగ్గినట్లు వెల్లడించింది.
UK : కరోనా టీకా ధృవపత్రంపై ఇండియా – బ్రిటన్ వార్
ప్రపంచవ్యాప్తంగా గతవారం 7శాతం కరోనా మరణాలు తగ్గినట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. కరోనా బారిన పడి 60 వేలకు దిగువన మృతి చెందినట్లు పేర్కొంది. ఆగ్నేయ ఆసియాలో కరోనా మృతుల సంఖ్య 30 శాతం తగ్గగా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 7శాతం పెరగడం గమనార్హం.
భారత్, అమెరికా, బ్రిటన్, టర్కీ, ఫిలిప్పీన్స్‌ల్లో అత్యధిక కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్ డెల్టా రకం సంక్రమించే శక్తి ఎక్కువగా ప్రపంచంలోని ప్రతిచోట ఉందని తెలిపింది. 185 దేశాల్లో ఈ వేరియంట్ బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.