చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ : 213కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. చైనాలో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది.

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 02:37 AM IST
చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ : 213కి చేరిన మృతుల సంఖ్య

Updated On : January 31, 2020 / 2:37 AM IST

కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. చైనాలో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది.

కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. చైనాలో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ మృతుల సంఖ్య 213కి చేరింది. చైనాలో 9,300 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే 19 దేశాలకు విస్తరించింది. డబ్ల్యూహెచ్ వో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ప్రపంచ దేశాలు బయో సెక్యూరిటీ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి. 

కరోనా వ్యాపిస్తుండటంతో ఇటలీ.. చైనాకు అన్ని విమానాలను రద్దు చేసింది. చైనాతో సరిహద్దును మూసివేసేందుకు రష్యా సిద్ధమైంది. తమ దేశాల పౌరులను చైనా నుంచి తీసుకెళ్లేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, తదితర దేశాలు ఏర్పాట్లు చేసుకున్నారు. చైనాలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వుహాన్ లో భారత విద్యార్థులు చిక్కుకున్నారు. అధికారులు వారిని నేడు స్వదేశానికి తీసుకురానున్నారు. 

కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్‌ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు చైనాను వణికిస్తోన్న మహమ్మారి భారత్‌లో కూడా అడుగుపెట్టింది. కేరళలో మొదటి కేసు నమోదు కావడంతో… అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.