కరోనా ఎప్పుడు అంతమో చెప్పిన డబ్ల్యూహెచ్ వో

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 03:50 PM IST
కరోనా ఎప్పుడు అంతమో చెప్పిన డబ్ల్యూహెచ్ వో

Updated On : August 22, 2020 / 4:34 PM IST

ఈ దిక్కుమాలిన కరోనా ఎప్పుడు పోతుందో ? ఏమోనని ప్రజలు తెగ ఆలోచిస్తున్నారు. ఎన్నో జీవితాలను ప్రభావితం చేసిన ఈ వైరస్ ఎప్పుడు అంతమౌతుందో వెల్లడించింది డబ్ల్యూహెచ్ వో. ఎప్పుడు ? రేపా ? ఎల్లుండా ? అని అనుకుంటున్నారా..అదేం కాదు..రెండు సంవత్సరాల్లో ఇది అంతమౌతుందని ప్రకటించింది.



ఈ మేరకు జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ వెల్లడించారు. రెండేళ్లలో కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందని, కానీ..ఈ వైరస్ వల్ల ఎన్నో జాగ్రత్తలు నేర్పిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే..వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నియమించిన లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదన్నారు.

ప్రజలు స్వచ్చందంగా..స్వీయ క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ వైరస్ ను అరికట్టేందుకు ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని, రెండు సంవత్సరాల్లో ఎలాగైనా కరోనా వైరస్ కథ ముగిసిపోతుందన్నారు.



చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ కారణంగా ప్రపంచంలోని ఎన్నో దేశాలు అతలాకుతలమౌతున్నాయి. లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నరు. భారతదేశంలో కూడా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రజలను వణికిస్తోంది.

ఎన్నో సంస్థలు వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటికే రష్యా దేశం వ్యాక్సిన్ రూపొందించి విడుదల చేసింది. డబ్ల్యూ హెచ్ వో చెబుతున్నట్లు రానున్న రెండు సంవత్సరాల్లో కరోనా వైరస్ అంతమౌతుందా ? లేదా ? అనేది చూడాలి.