స్పెయిన్ లో మరణ మృదంగం..మృతి చెందిన రాజ కుటుంబీకురాలు

  • Published By: madhu ,Published On : March 29, 2020 / 02:46 AM IST
స్పెయిన్ లో మరణ మృదంగం..మృతి చెందిన రాజ కుటుంబీకురాలు

Updated On : March 29, 2020 / 2:46 AM IST

కరోనా వైరస్ ఉధృతికి ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. చైనా నుంచి ఈ వైరస్ ఖండంతారాలను దాటింది. ఈ రాకాసి బారిన పడిన వారి సంఖ్య 6 లక్షలకు దాటిపోయింది. మరణాల సంఖ్య 30 వేలకు చేరువవుతోంది. ఇటలీలో మరణాల సంఖ్య అధికంగా ఉంది. స్పెయిన్ లో కూడా మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.

2020, మార్చి 28వ తేదీ శనివారం ఒక్క రోజే..6500 పైగా కేసులు నమోదవుతున్నాయి. 834 మంది రోగులు కన్నుమూశారు. స్పెయిన్ రాజు నాలుగో ఫెలిప్ కజిన్ ప్రిన్సెస్ మారియా తెరెసా..చనిపోయారు. ఈ విషయాన్ని రాజ కుటుంబం అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో అంత్యక్రియలు నిర్వహించారు. అమెరికా, ఇటలీ తర్వాత అదే స్థాయిలో స్పెయిన్ లో మృతుల సంఖ్య, కేసులు అధికమౌతున్నాయి.

2020, మార్చి 28వ తేదీ శనివారం కొత్తగా 7 వేల 513 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 73 వేల 232కి చేరింది. శనివారం మొత్తం 844 మంది చనిపోయారు. మొత్తం ఇప్పటి వరకు  5 వేల 982 మంది చనిపోయారు. ఇటలీ తర్వాత అధికంగా మరణాలు స్పెయిన్ లో సంభవిస్తున్నాయి. అమెరికాలో 241, ఇరాన్ లో 139 మంది చనిపోయారు. ఐరోపా దేశాల్లో అత్యవసర సేవలు ఇంకా చక్కబడలేదు. అనేక నగరాలు దిగ్భందనంలో కొనసాగుతున్నాయి.