ఎవర్ని బతికించాలో మీరే తేల్చుకోమంటున్న డాక్టర్లు

మాడ్రిడ్ లోని ఎమర్జెన్సీ రూంలో ఒక కరోనా పేషెంట్ కు డెత్ సర్టిఫికేట్ ఇస్తూనే మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లాడు డేనియల్ బెర్నబ్యూ. వెయిటింగ్ రూంలలో ఎదురుచూస్తూనే ప్రాణఆలు కోల్పోతున్నారు కరోనా పేషెంట్లు. స్పెయిన్ లో కొన్ని చోట్ల అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కూడా చోటు దొరకడం లేదు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కొత్త రూల్స్ తో హ్యాంగ్ అయిపోతున్నాయి. పాత పేషెంట్లను చికిత్స చేయకముందే కొత్త వాళ్లు వచ్చిపడుతున్నారు. ‘ఆ తాత ఏ పరిస్థితుల్లో అయినా, బతికే అవకాశం కనిపించడం లేదు. చాలా మంది చావుతో పోరాడుతున్న వారిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే ముందెవరికి చికిత్స కావాలో వారే తేల్చుకోవాలి’ అని ఆ డాక్టర్ అంటున్నాడు.
స్పెయిన్ కబలిస్తున్న కొవిడ్ 19 యూరప్ మొత్తానికి షాకింగ్ గా మారింది. 47మిలియన్ మంది జనాభా ఉన్న దేశమైనప్పటికీ చైనా కంటే వేగంగా కరోనా ప్రభావానికి గురవుతోంది. ఇటలీ కంటే వేగంగా పాకడంతో స్పెయిన్ కోలుకోలేకుండా ఉంది. స్పెయిన్ గవర్నమెంట్ కరోనా కారణంగా 738 చనిపోయినట్లు ప్రకటించింది. గురువారం ఒక్కరోజే 655మంది చనిపోగా స్పెయిన్ లో కరోనా ప్రభావంతో 4వేల 89మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని పెడ్రో శాంచెజ్ మూడు వారాల ముందే వైరస్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంలో చాలా మంది ఇటువంటి పరిస్థితులను ఇప్పటివరకూ ఫేస్ చేయలేదు.
సివిల్ వార్ గురించి తెలిసిన వాళ్లు మాత్రమే అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి కంటే గడ్డు పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్లోనూ వ్యాధి లక్షణాలున్న వాళ్లు కనిపించడంతో అంతా లాక్ డౌన్ ప్రకటించేశారు. అత్యవసర సమయంలోనే బయటకు రావాలని అప్పుడు కూడా పూర్తి స్థాయి సేఫ్టీతోనే రావాలని పిలుపునిచ్చారు అక్కడి ప్రధాని.
Also Read | క్వారంటైన్‌ను పక్కకుబెట్టి కేరళ నుంచి యూపీ వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్‌పై సీరియస్