Iran Israel War: యుద్ధం ముగిసింది..! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం.. డొనాల్డ్ ట్రంప్ బిగ్ అనౌన్స్‌మెంట్
ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

Donald Trump
Iran Israel War: ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. మరో ఆరు గంటల్లో ఈ ప్రక్రియ ప్రారంభమై.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది అంటూ మంగళవారం తెల్లవారు జామున 2.32గంటలకు (భారత కాలమానం) ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్’ లో పోస్టు చేశారు. అయితే, ట్రంప్ ప్రకటించినట్లుగా కాల్పుల విరమణపై ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: Indians Alert: భారతీయులు ఇళ్లలోనే ఉండండి.. ఇరాన్ దాడులతో ఖతార్ లోని ఇండియన్స్ కు కీలక సూచనలు..
ట్రంప్ ఏమన్నారంటే.. ‘‘ఇజ్రాయెల్, ఇరాన్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్ కాల్పుల విమరణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది. దీంతో 12రోజుల యుద్ధానికి ఎండ్ కార్డు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందనే భావిస్తున్నాను. ఇజ్రాయెల్ , ఇరాన్ తో సహా మధ్యప్రాచ్యం, ప్రపంచ దేశాలతోపాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది’’ అంటూ ట్రంప్ పోస్టు చేశారు.
ఇజ్రాయెల్ కు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు రాయిటర్స్ తో మాట్లాడుతూ.. ఇరాన్ పై తమ దేశం కొనసాగిస్తున్న సైనిక మిషన్ ను ముగించడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం గురించి అమెరికాకు తెలియజేయడం జరిగింది అంటూ పేర్కొన్నారు. మరోవైపు.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని ప్రకటించారు.