ముస్లీంలు వెళ్లిపోండి: పాకిస్తానీల ఇళ్లపై శ్రీలంక వాసుల దాడులు

  • Published By: vamsi ,Published On : April 25, 2019 / 12:06 PM IST
ముస్లీంలు వెళ్లిపోండి: పాకిస్తానీల ఇళ్లపై శ్రీలంక వాసుల దాడులు

Updated On : April 25, 2019 / 12:06 PM IST

పర్యాటక రంగానికి ప్రసిద్ధి గాంచిన శ్రీలంకలో ఉగ్రవాదులు బాంబులు వేసిన తర్వాత పరిస్థతి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా బాంబు దాడులు జరిగిన కొలంబో.. నెగెంబో ప్రాంతాల్లో పరిస్థితి తి ఏమాత్రం బాలేదు. పూర్తి సెక్యూరిటీ ఉందని సైన్యం చెబుతున్నప్పటికీ, ఎక్కడ ఏ బాంబు పేలుతుందోననే టెన్షన్ అక్కడి అధికారుల్లోనే కాక సామాన్య ప్రజల్లోనూ ఉంది. ఈ క్రమంలో అక్కడి చర్చిలను కూడా తాత్కాలికంగా అధికారులు మూసివేశారు.

కంటిమీద కునుకు లేకుండా బ్రతుకుతున్న శ్రీలంక వాసులు.. అక్కడి ముస్లీంలను కూడా అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నెగంబో ప్రాంతంలోని ముస్లీంలను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తానీ ముస్లీంలు ఇక్కడ ఉండేందుకు వీలు లేదంటూ వారిని వారి దేశాలకు పంపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై స్థానికంగా ఉంటున్న పాకిస్తాన్ ముస్లీం ఆద్నాన్ అలీ మాట్లాడుతూ.. బాంబు దాడులు తర్వాత ఆగ్రహంతో ఉన్న శ్రీలంక వాసులు తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 359 మంది మరణించగా మరో 500 మందికిపైగా క్షతగాత్రులు అయ్యారు.

ప్రస్తుతం శ్రీలంకలో హైఅలర్ట్ కొనసాగుతోంది.  మరిన్ని ఉగ్ర దాడులు జరుగవచ్చుననే అంచనాలతో అణువణువు గాలిస్తున్నారు సెక్యురిటీ అధికారులు. దాడి తామే చేసినట్లుగా ఇప్పటికే ఐసీస్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.