Earthquake : ఇండోనేషియాలో మరోసారి భూకంపం .. 4.7 తీవ్రతగా నమోదు

మరోసారి ఇండోనేషియాను భూకంపం వణికింది. రిక్కర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.7గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు.

Earthquake : ఇండోనేషియాలో మరోసారి భూకంపం .. 4.7 తీవ్రతగా నమోదు

Earthquake In indonesia

Updated On : September 23, 2022 / 11:20 AM IST

Earthquake In indonesia : ఇండోనేషియాని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత ఆగస్టు 23 ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. 2022లోనే ఫిబ్రవరి, ఏప్రిల్ లో కూడా భూకంపాలు సంభవించాయి. ఈక్రమంలో మరోసారి ఇండోనేషియాను భూకంపం వణికింది. రిక్కర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.7గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. ఉత్తర సుమత్రా ప్రావిన్స్ లోని శుక్రవారం (సెప్టెంబర్ 22,2022)తెల్లవారుఝామున 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కలుగలేదని తెలిపారు అధికారులు.

గత ఆగస్టు 23న ఇండోనేషియాలో భూకంపం సంభవించగా ఆ తరువాత దేశంలోని పశ్చిమ ప్రావిన్స్ లోని బెంగ్ కులులో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదే సంవత్సరంలో ఫిబ్రవరి, ఏప్రిల్ లో కూడా భూకంపాలు సంభవించి ఇండోనేషియాను వణికిస్తున్నాయి.