లాక్ డౌన్ దశలవారీగా ఎత్తివేస్తాం.. అఖిలపక్షంతో మోడీ.. కరోనా ప్రాంతాల్లో కొనసాగాల్సిందే

  • Published By: sreehari ,Published On : April 8, 2020 / 10:43 AM IST
లాక్ డౌన్ దశలవారీగా ఎత్తివేస్తాం.. అఖిలపక్షంతో మోడీ.. కరోనా ప్రాంతాల్లో కొనసాగాల్సిందే

Updated On : April 8, 2020 / 10:43 AM IST

భారతదేశంలో కొవిడ్-19 సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల నమోదు తీవ్రతను బట్టి లాక్ డౌన్  మరిన్నిరోజులు పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేతల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ నెల 14న లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదన్నారు. ఒకేసారి లాక్ డౌన్ ఎత్తివేయలేమని చెప్పారు. ఏప్రిల్ 11న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ అంశంపై రాష్ట్రాల సీఎంలతో సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు.

కరోనా తర్వాత పరిస్థితులు మునపటిలాగా ఉండవని మోడీ చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 62 జిల్లాల్లో పూర్తిస్థాయిలో నిర్బంధం ఉంటుందని తెలిపారు. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకూ లాక్ డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ ఎత్తివేయాల్సి వస్తే దశలవారీగా తొలగించే యోచనలో కేంద్రం ఉంది. లాక్ డౌన్ కొనసాగింపుపై అఖిల పక్ష నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టతనిచ్చారు. (మహారాష్ట్రకు మీరు కావాలి : మెడికల్ ఫీల్డ్ అనుభవమున్న రిటైర్డ్ ఆర్మి సిబ్బందికి ఉద్దవ్ విజ్ణప్తి)

కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో విభిన్న అంశాలను పరిష్కరించడానికి వాటికి అనుగుణంగా మార్గాలను సూచించడానికి మొత్తం 11 సాధికార సంస్థలు ఏర్పాటు అయ్యాయి. ఈ సాధికార కమిటీలు లాక్‌డౌన్ క్రమంగా ఎత్తివేయడానికి అనుకూలంగా ఉన్నాయి. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఈ విషయం తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. హోం సెక్రటరీ అజయ్ భాలా అధ్యక్షతన జరిగిన సమావేశం లాక్ డౌన్ అంశంపై కనీసం మూడు ప్రజెంటేషన్లను పరిశీలించింది. లాక్ డౌన్ ఎత్తివేతకు అనుకూలంగా ప్రతిఒక్కరూ అంగీకరించనిప్పటికీ దశలవారీగా ఎత్తివేత ప్రారంభమైనప్పటికీ కూడా అంతర్జాతీయ ప్రయాణం నిలిపివేతను అలాగే కొనసాగించాలని కోరినట్టు వారు చెప్పారు. 

లాక్ డౌన్ ఎప్పటినుంచి ఎత్తివేయడం జరుగుతుంది? ఏ విధంగా ఎత్తివేయనున్నారు అనేది ఏ తేదీన అమల్లోకి వస్తుందో తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. దేశంలో కొవిడ్-19 కేసులకు సంబంధించి డేటాను ICMR, National Disaster Management Authority (NDMA) మూడు రోజుల్లో అందించే అవకాశం ఉంది. ICMR జిల్లాలవారీగా కరోనా కేసుల డేటాను సేకరించనుంది.

అందులో రోజువారీగా ఎన్ని కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంతమంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.. ఏయే ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.. మొత్తం డేటాను సేకరించనున్నట్టు విషయం తెలిసిన వ్యక్తి వెల్లడించారు. మరో వ్యక్తి చెప్పిన ప్రకారం.. ఈ 11 సాధికారిత సంస్థలు తమ సిఫార్సులను సమర్పించాయి. ఇప్పటికే దీనిపై మూడు ప్రజెంటేషన్లు కూడా రెడీ అయ్యాయి. వీటి ఆధారంగా వచ్చే తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. 

లాక్‌డౌన్ ఎత్తివేతపై ప్రతిపాదనలు ఇవే :
లాక్ డౌన్ ఎత్తివేతపై ఇచ్చిన ప్రతిపాదనల్లో ఒకటి.. దేశాన్ని మొత్తం మూడు జోన్లు (గ్రీన్, ఎల్లో, రెడ్)గా విభజించనున్నారు. వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వైరస్ ప్రభావాన్ని బట్టి జోన్లను కేటాయిస్తారు. గ్రీన్ జోన్ అంటే సురక్షితమైన ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ ప్రాంతాల్లో మాత్రం ఆర్థికపరమైన కార్యకలాపాలన్ని కొనసాగుతుంటాయి. ఇక ఎల్లో జోన్ లో మాత్రం.. చిన్నమొత్తంలో ప్రొడక్షన్ ప్రారంభం అవుతుంది. రెడ్ జోన్ ప్రాంతాల్లో మాత్రం కొవిడ్-19 వైరస్ తీవ్రతను బట్టి లాక్ డౌన్ మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది. 

మరో ప్రతిపాదనలో.. వలస కార్మికుల ట్రాన్స్ పోర్టుకు సంబంధించి ఉంది. లాక్ డౌన్ కారణంగా సొంతూళ్లు వెళ్లాల్సిన వారంతా ఎక్కడవారు అక్కడే చిక్కుకుపోయారు. వారందరిని తిరిగి తమ సొంతూళ్లకు రైళ్లలో వెళ్లాల్సి ఉంది. రైళ్లలోనూ సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు చేపట్టిన తర్వాతే అనుమతించే అవకాశం ఉంటుంది.. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో ముందే చెకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా, దేశీయ విమాన సర్వీసులు కూడా కొన్ని నిర్ధిష్టమైన ప్రామాణాలతో ఆపరేటింగ్ విధానాలను ప్రారంభించనున్నారు. 

వివిధ రోజులలో రిటైల్ దుకాణాలను రొటేషన్ ప్రాతిపదికన తెరిచి ఉంచాలని ఒక ప్రతిపాదన ఉంది. ఒక ప్రాంతంలో నిర్దిష్ట సంఖ్యలో దుకాణాలను ఒకేసారి కొన్ని గంటలు తెరిచి ఉంచడానికి అనుమతించాలి. గంటలు 24/7 ఉండాలి. ఇది రిటైల్ అందుబాటులో ఉందని సూచిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మార్కెట్లలో జనం గుమిగూడకుండా ఉండటాన్ని నివారించవచ్చునని అంటున్నారు.