FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ జరిగే ఖతార్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం
అగ్నిప్రమాదం సభవించిన ప్రదేశంలో శనివారం సాయంత్రం అర్జెంటీనా, మెక్సికో సహా అనేక ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగాయి. నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

Fir accident
FIFA World Cup: ఫిఫా ప్రపంచ కప్-2022 నగరమైన ఖతార్‌లోని లుసైల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం ప్రపంచకప్ మ్యాచ్ ఆడాల్సిన కేటేఫాన్ ఐలాండ్ నార్త్ సమీపంలోని ఫ్యాన్ గ్రామం నుంచి నల్లటి పొగలు కమ్ముకున్నట్లు ఫుటేజీ చూపించింది. కానీ అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. లుసైల్ నగరంలో భాగమైన ప్రదేశంలో స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఈ మంటలు చెలరేగాయయని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
అగ్నిప్రమాదం సభవించిన ప్రదేశంలో శనివారం సాయంత్రం అర్జెంటీనా, మెక్సికో సహా అనేక ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగాయి. నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. వీడియోలో భవనం పైకప్పు కాలిపోతున్నట్లు కనిపించింది. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే వాటిని అదుపు చేయడంతో, ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి ఖతార్ భారీగా ఖర్చు చేసింది. ఆటగాళ్లకు, మ్యాచ్ లను తిలకించేందుకు వచ్చే ప్రేక్షక్షులకోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంది. కానీ మ్యాచ్ జరిగే కొద్దిదూరంలోనే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. నవంబర్ 20న ప్రారంభమైన వరల్డ్ కప్ మ్యాచ్లను తిలకించేందుకు వివిధ దేశాల నుంచి క్రీడాభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఈ మెగా టోర్నీ డిసెంబర్ 18న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.