డేంజర్ బెల్స్ : అమెరికాలో తొలి కరోనా కేసు
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరనో వైరస్... అగ్రరాజ్యం అమెరికాలోనూ కలకలం రేపుతోంది. అమెరికాలో తొలి కరోనా కేసు నమోదైంది. న్యూయార్క్ లో మన్ హట్టన్

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరనో వైరస్… అగ్రరాజ్యం అమెరికాలోనూ కలకలం రేపుతోంది. అమెరికాలో తొలి కరోనా కేసు నమోదైంది. న్యూయార్క్ లో మన్ హట్టన్
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరనో వైరస్… అగ్రరాజ్యం అమెరికాలోనూ కలకలం రేపుతోంది. అమెరికాలో తొలి కరోనా కేసు నమోదైంది. న్యూయార్క్ రాష్ట్రంలో(new york) మన్ హట్టన్ కు(manhattan) చెందిన ఓ మహిళ కరోనా బారిన పడింది. దీంతో అమెరికాలో తొలి కరోనా కేసు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అమెరికాలోనూ కరోనా కేసు వెలుగు చూడటంతో అమెరికన్లు భయాందోళన చెందుతున్నారు. కరోనాకి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. కరోనా వస్తే ప్రాణం పోవాల్సిందే. దీంతో అమెరికన్లలో ఆందోళన మొదలైంది.
ఇరాన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా:
న్యూయార్క్ లో తొలి కరోనా కేసు నమోదైనట్టు గవర్నర్ ఆండ్రూ కుమో నిర్ధారించారు. ఇరాన్ నుంచి న్యూయార్క్ సిటీకి వచ్చిన మహిళ కరోనా వైరస్ బారిన పడినట్టు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చాక ఆ మహిళ అస్వత్థకు గురైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచారు. ఆమె పరిస్థితి మరీ అంత విషమంగా లేదని గవర్నర్ చెప్పారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కంట్రోల్ లోనే ఉందన్నారు. ఆ మహిళ వయసు 30ఏళ్లు. బాధితురాలు మన్ హట్టన్ లో నివాసం ఉంటుంది.(బీ అలర్ట్: హైదరాబాద్ గాంధీలో కరోనా కలకలం)
అప్రమత్తమైన ఆరోగ్యశాఖ:
న్యూయార్క్ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని వ్యవస్థలను సిద్ధం చేశారని గవర్నర్ తెలిపారు. తొలి కరోనా కేసు నమోదు కావడంతో.. న్యూయార్క్ అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనాను ఎదుర్కొనే ప్లాన్ పై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరో ఇద్దరు వ్యక్తులను డాక్టర్లు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ ఉందేమోనని టెస్టులు చేస్తున్నారు. ఆ ఇద్దరు కూడా ఇరాన్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.
60 దేశాలపై కరోనా ప్రభావం:
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా.. చైనాని వణికించింది. చైనాలో వేల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. చైనా నుంచి కరోనా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. 60కు పైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 88వేల కేసులు నమోదయ్యాయి. 3వేల మంది కరోనాతో చనిపోయారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చైనాలో ఇప్పుడిప్పుడే కరోనా కంట్రోల్ లోకి వస్తోంది. హమ్మయ్య అని అనుకునే లోపు.. ఇటలీ, సౌత్ కొరియా, ఇరాన్ దేశాల్లో కరోనా విజృంభిస్తుండటంతో ఆందోళనకు గురి చేస్తోంది.