భూమిపై మొదట జీవం ఎలా పుట్టింది? అంగారకుడి జీవం మన పూర్వీకులేనా?

భూమిపై మొదట జీవం ఎలా పుట్టింది? అంగారకుడి జీవం మన పూర్వీకులేనా?

Updated On : February 14, 2021 / 1:49 PM IST

How life on Earth originated Mars : మన భూమిపై జీవానికి మూలం ఎక్కడ? మొదటి మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అసలు భూమిపై జీవం ఎలా ఆవిర్భవించింది? ఇప్పటికే జీవం పుట్టకకు సంబంధించి ఎన్నో అధ్యయనాలు జరిగాయి. ఎన్నో పరిశోధనలు చేశారు సైంటిస్టులు.. అయినా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. కచ్చితమైన జీవ మూలాలను కనిపెట్టలేకపోయారు. ఇంతకీ జీవం పుట్టకను కనుగొనడం సాధ్యమేనా? అంటే కొందరు సైంటిస్టులు భూమిపై జీవం పుట్టకకు సంబంధించి మూలాలు ఎక్కడో ఒకచోట ఉద్భవించి ఉండొచ్చునని అంటున్నారు. మార్స్ కు సంబంధించి మూలమైన మనం మార్టియన్లు అయితే.. ఇంతకీ ఏలియన్లు ఎవరు? అనేది అంతుపట్టని ప్రశ్న..

ప్రస్తుతం.. భూమిపై జీవాలు ఆవిర్భవించడానికి ఏదో ఒక ప్రధాన మూలం ఉండి ఉంటుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అది కూడా పక్క గ్రహమైన మార్స్ (అంగారకుడు) నుంచి మూలాలు భూమిపైకి వచ్చాయని అంటున్నారు. భూమిపై జీవం ఆరంభమై కొన్ని బిలియన్ల ఏళ్లు గడుస్తోంది. ఒక గ్రహంపై జీవం మరో గ్రహంపైకి వ్యాపించడాన్ని పాన్స్పెర్మియా అంటారు. అంగారక గ్రహం నుండి రాళ్లు భూమిపైకి వచ్చాయని అంటుంటారు. ప్రాచీన అంగారక గ్రహం నుంచి ఈ రాళ్లు భూమిపైకి వచ్చాయని భావిస్తున్నారు. దీనికి సంబంధించి శాస్త్రీయంగా నిరూపించడానికి మరో మార్గం లేదంటున్నారు సైంటిస్టులు.

మనకు తెలిసినంతవరకు జీవం ఉండేది ఒక భూమిపైనే. హార్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అమీర్ సిరాజ్ పాన్స్‌పెర్మియా ఎలా సంభవించవచ్చనే దానిపై ఇతర గ్రహాలకు లేదా ఇతర నక్షత్ర వ్యవస్థలకు కూడా జీవం ఎలా వ్యాపించిందో వివరణ ఇచ్చారు. అలాగే అంగారకుడికి ఎప్పుడైనా జీవితం ఉందా లేదా అనేది మనకు ఖచ్చితంగా తెలియదంటున్నారు. సౌర వ్యవస్థ నుంచి ఏదైనా గ్రహం ఒక దానికొకటి తాకినప్పుడు అందులోని జీవం మరొకదానికి రావడం సాధ్యమని సూచిస్తున్నాయి.

సూక్ష్మజీవుల జీవితం కూడా అలానే వ్యాప్తి చెందుతుందని చెబుతున్నాయి. అంగారక గ్రహంపై సూక్ష్మజీవుల జీవితాన్ని లేదా గత జీవితానికి సాక్ష్యాలను కనుగొంటే తప్పా ఆ జీవితం నిజంగా మన ప్రాచీన పూర్వీకులా లేదా అనేది తేలిపోతుంది. కొన్ని బిలియన్ సంవత్సరాలలో అంగారక గ్రహం భూమిపై జీవనానికి ఎలా కారణమైందనే ప్రశ్నకు సమాధానం దొరికినట్టు అవుతుంది.