పాకిస్థాన్‌లో బయటపడ్డ వందల ఏళ్ల నాటి హనుమాన్ విగ్రహాలు 

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 09:21 AM IST
పాకిస్థాన్‌లో బయటపడ్డ వందల ఏళ్ల నాటి హనుమాన్ విగ్రహాలు 

Updated On : September 4, 2019 / 9:21 AM IST

పాకిస్థాన్ లో  హనుమంతుడి ఆనవాళ్లు బైటపడ్డాయి. కరాచీలోని సోల్జర్ బజార్‌లోని చారిత్రాత్మక పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో భక్త హనుమాన్ విగ్రహాలు బైటపడ్డాయి. ఇవి అంత్యం పురాతనమైన విగ్రహాలు అని అధికారులు తేల్చాయి. ఇవి సుమారు 15 వందల సంవత్సరాల నాటివని తెలిపారు. 

కరాచీలోని సెల్జర్ బజార్‌లో నెలకొన్న పంచముఖ హనుమాన్ మందిరం తవ్వకాల్లో ఈ విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి ఎంతో విలువైనవిగా తెలుస్తోంది. ఈ విగ్రహాలను అమూల్యమైన రాయితో ఆనాటి శిల్పులు చెక్కారని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. 15 వందల సంవత్సరాల క్రితం నాటివైన ఈ ఈ విగ్రహాలపై ఈనాటికి సింధూరం ఆనవాళ్ల కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలలో హనుమంతుడు, గణేశుడు, నంది మొదలైనవి ఉన్నాయి. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా అక్కడి పనివారికి ఈ విగ్రహాలు లభ్యమయ్యాయి. తొమ్మిది హనుమాన్ విగ్రహాలతో పాటు గణేషుడు విగ్రహాలు, షెరావాలి మాతా విగ్రహాలు, కొన్ని మట్టి కుండలు లభ్యమయ్యాయి. 

తవ్వకాలు జరిపిన ఈ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు 11 గానీ..21 సార్లు గానీ ప్రదక్షిణ చేస్తే కోరిక కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్మేవారట. ఈ హనుమంతుడి విగ్రహాలు స్వయంభూగా వెలసాయని భక్తులు నమ్మేవారు. ఈ ప్రదేశానికి సంబంధించిన పురాణం ప్రకారంగా..హనుమంతుడి ఆరాద్యదైవం శ్రీరాముడు కూడా ఈ ఆలయాన్ని సందర్భించాడని చెబుతోంది. 

పాకిస్థాన్ లో ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి. ఒకప్పుడు అఖండ భారతంగా వర్థిల్లిన భారత్ స్వతంత్ర్యానంతరం భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. అనంతరం పాక్ లోని పలు హిందూ దేవాలయాలు శిథిలావస్థలకు చేరుకున్నాయి. దీంతో పంచముఖి ఆలయం కూడా కాల గర్భంలో కలిసి పోగా..వాటిలో తవ్వకాలు జరపగా పలు కళాఖండాలు బైటపడ్డాయి.