కాళ్లబేరానికి పాక్ : మోడీతో ఫోన్ లో మాట్లాడటానికి సిద్ధమన్న ఇమ్రాన్

భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలను భారత్ ధీటుగా తిప్పికొడుతోంది.ఓ వైపు అంతర్జతీయ సమాజం మొత్తం పాక్ పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో దిక్కుతోచని స్థితిలో కాళ్లబేరానికి పాక్ సిద్ధమైంది.
Read Also : కశ్మీర్ సమస్య కు పరిష్కారం కేసిఆర్ చూపగలరు
రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సద్దుమణగడానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమ్మద్ ఖురేషి తెలిపారు.
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రస్థావరాలపై భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఎల్ వోసీ దాటి భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి.
అప్రమత్తంగా ఉన్న భారత్ పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఇదే సమయంలో రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
Read Also : నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం