దారితప్పిన జార్జియా విమానం : అడ్డుకున్న IAF.. జైపూర్‌లో ల్యాండ్

భారత వైమానిక గగనతలంలోకి అక్రమంగా చొరబడిన జార్జియా ఎయిర్ క్రాఫ్ట్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ అడ్డుకున్నాయి. జార్జియాకు చెందిన ఆంటోనోవ్ ఎఎన్-12 జెట్ విమానం కరాచీ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.

  • Published By: sreehari ,Published On : May 10, 2019 / 01:46 PM IST
దారితప్పిన జార్జియా విమానం : అడ్డుకున్న IAF.. జైపూర్‌లో ల్యాండ్

Updated On : May 10, 2019 / 1:46 PM IST

భారత వైమానిక గగనతలంలోకి అక్రమంగా చొరబడిన జార్జియా ఎయిర్ క్రాఫ్ట్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ అడ్డుకున్నాయి. జార్జియాకు చెందిన ఆంటోనోవ్ ఎఎన్-12 జెట్ విమానం కరాచీ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.

భారత వైమానిక గగనతలంలోకి అక్రమంగా చొరబడిన జార్జియా ఎయిర్ క్రాఫ్ట్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ అడ్డుకున్నాయి. ఇండియా ఎయిర్ స్పేస్ ను ఉల్లఘించిన జార్జియా విమానాన్ని జైపూర్ ఎయిర్ పోర్టులో బలవంతంగా ల్యాండ్ చేశారు. జార్జియాకు చెందిన ఆంటోనోవ్ ఎఎన్-12 జెట్ విమానం షెడ్యూల్ ప్రకారం.. పాకిస్థాన్ లోని కరాచీ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.

ఈ క్రమంలో గగనతలంలో దారితప్పి ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచి ఉత్తర గుజరాత్ లోకి ప్రవేశించింది. దీంతో విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  జార్జియా విమానంలోని పైలట్, సిబ్బందిని ఇండియన్ ఫోర్స్ అధికారులు విచారిస్తున్నారు.

కొన్ని నెలల నుంచి ఇండియా, పాకిస్థాన్ దేశ సరిహద్దుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ఓసీ దగ్గర ఏరియల్ డాగ్ ఫ్యాట్ జరిగినప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అనుమానాస్పద విమానాలు గగనతలంలో కనిపించినా వెంటనే తమ అధీనంలోకి తీసుకుంటోంది ఐఎఎఫ్.

జార్జియా విమానాన్ని గగనతలంలో గుర్తించిన ఐఎఎఫ్ ఫైటర్ జెట్స్ వెంటనే అప్రమత్తమై ఆ విమానాన్ని అడ్డుకుంది. ఆంటొనో ఎఎన్-12 విమానం.. నాలుగు ఇంజిన్లతో కూడిన టర్బోప్రాప్ ట్రాన్స్ ఫోర్ట్ గా సొవియేట్ యూనియన్ డిజైన్ చేసింది. కార్గో ఆపరేటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లు ఎంతో పాపులర్ కూడా.