Tokyo Olympics : భారత బాక్సర్ లవ్‌లీనా విజయం..క్వార్టర్ ఫైనల్లోకి ఎంట్రీ
టోక్యో ఒలింపిక్స్ లో మరో మహిళా అథ్లెట్ మరో అడుగు ముందుకేసింది. బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగంలో లవ్లీనా సత్తా చాటింది. ఫ్రీ క్వార్టర్స్ రెండో రౌండ్ లో జర్మన్‌కి చెందిన నదైన్ అపెజ్‌ను 3-2 తేడాతో ఓడించిన లవ్‌లీనా క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. అపెజ్‌పై తొలి రౌండ్ నుంచి ఆధిక్యం చూపించిన లవ్‌లీనా మెడల్ సాధించే దిశగా దూసుకెళుతోంది.ఈక్రమంలో మూడు రౌండ్లలోనూ మంచి పాయింట్లు సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.

Indian Women Boxer Lovelyna Borgohain Wins Her First Bout In Tokyo Olympics
Tokyo Olympics indian boxer lovelyna borgohain wins : టోక్యో ఒలింపిక్స్ లో మరో మహిళా అథ్లెట్ మరో అడుగు ముందుకేసింది. బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగంలో లవ్లీనా సత్తా చాటింది. ఫ్రీ క్వార్టర్స్ రెండో రౌండ్ లో జర్మన్‌కి చెందిన నదైన్ అపెజ్‌ను 3-2 తేడాతో ఓడించిన లవ్‌లీనా క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. అపెజ్‌పై తొలి రౌండ్ నుంచి ఆధిక్యం చూపించిన లవ్‌లీనా మెడల్ సాధించే దిశగా దూసుకెళుతోంది.ఈక్రమంలో మూడు రౌండ్లలోనూ మంచి పాయింట్లు సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.
మొదటి రౌండ్‌లో లవ్‌లీనాకు బై దొరకడంతో నేరుగా రెండో రౌండ్‌కి అర్హత సాధించింది. ఈ బౌట్ హోరాహోరీగా జరిగినా లవ్లీనా కాస్త గట్టిపోటీ ఇచ్చి విజయం సాధించింది. మూడు రౌండ్లలోనూ లవ్లీనా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడు రౌండ్లలోనూ ముగ్గురు జడ్జీలు లవ్లీనాకు 10 స్కోరు ఇవ్వగా.. ఇద్దరు 9 ఇచ్చారు. చివరికి 3-2తో గెలిచి తర్వాతి రౌండ్‌లో అడుగుపెట్టింది. ఆమెకు తొలి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రౌండ్ ఆఫ్ 16లో తన తొలి బౌట్ ఆడింది. క్వార్టర్స్ బౌట్ గెలిస్తే చాలు లవ్లీనాకు మెడల్ ఖాయం అయి కనీసం బ్రాంజ్ మెడల్ అయినా ఖాయమవుతుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం (జులై 27,2021) భారత్‌కి కాస్తంత శుభారంభాన్నిచ్చింది. భారత పురుషుల హాకీ జట్టు, స్పెయిన్‌పై విజయం సాధించగా… టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ మూడో రౌండ్‌లో ఓటమిపాలై నిష్కమించాల్సి వచ్చింది.బ్యాడ్మింటన్‌లో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి రెండో విజయాన్ని అందుకున్నా, గ్రూప్‌లో మూడో స్థానంలో నిలవడంతో క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు.షూటింగ్ ఈవెంట్‌లోనూ భారత జట్టు నిరాశపరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అంజుమ్-దీపక్ కుమార్, ఎలవెనిల్ – దివ్యాంశ్ జోడి ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయారు.