తెలిస్తే షాక్ అవుతారు: #CoronaBeerVirus కోసం ఇండియన్స్ సెర్చింగ్!

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది ప్రాణాంతక #coronavirus.. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ రోజురోజుకీ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటివరకూ 82 మంది ప్రాణాలు కోల్పోగా.. 2700కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చివరికి ఇండియాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చైనాకు వెళ్లొచ్చిన కొంతమందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచం మొత్తం కరోనా భయం పట్టుకుంది. బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. జంతువులు, పాముల మాంసం నుంచి సంక్రమించే ఈ వైరస్ మనుషుల్లోకి పాకింది.
కరోనా కోసం సెర్చింగ్ :
గాలిద్వారా వేగంగా వ్యాపించే ఈ డెడ్లీ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి సోకింది అనేదానిపై క్లారిటీ లేదు. వైరస్ సోకిన వెంటనే లక్షణాలు కనిపించకపోవడంతో ఎంతమంది ఈ వైరస్ బారినపడ్డారో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతటా కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనగా కనిపిస్తోంది.
అప్పటినుంచి ఈ వైరస్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్ సెర్చ్ లో వైరస్ ఏంటిది.. #WhattheVirusis అంటూ తెగ వెతుకుతున్నారట. #Howitspreads.. ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలా #HowCure అవుతుంది అని #Indianusers ఎక్కువగా search చేస్తున్నారు. కానీ, ఎంతగా వెతికినా ఈ వైరస్ కు సంబంధించి సమాధానం మాత్రం దొరకడం లేదట.
గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ :
అయితే, #coronavirus అంటే ఏంటి? అనేదానిపై ఎక్కువమంది సెర్చ్ చేయడంతో పెద్ద గందరగోళం నెలకొంది. ఇప్పటికే అదే పేరుతో పాపులర్ #Beer అందుబాటులో ఉంది.. దానిపేరు కూడా #coronabeer … దీంతో చాలామంది #coronabeervirus అంటూ గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారంట.
వాస్తవానికి కరోనా బీర్ కు.. కరోనా వైరస్ కు ఎలాంటి సంబంధం లేదు. దీని కారణంగా ఈ వైరస్ రానప్పటికీ గూగుల్ సెర్చ్ లో కరోనా వైరస్ కు బదులుగా కరోనా బీర్ వైరస్ అని ఎక్కుమంది సెర్చ్ చేయడంతో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో కూడా కరోనా బీర్ వైరస్ అనే కీవర్డ్ తో సెర్చ్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా కరోనా వైరస్ వ్యాప్తిపై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని అతి త్వరలో ప్రకటించనున్నట్టు పేర్కొంది. ఇండియాలోని రాజస్థాన్ లో ఈ కరోనో వైరస్ ఒకరికి సోకినట్టు ఓ రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం ఆ రోగిని జన సంచారానికి దూరంగా ఉంచినట్టు తెలిపింది.
Read Also: కరోనా వైరస్ ఎలా పుట్టింది? పాముల నుంచి మనుషుల్లోకి ఎలా?
చైనాలో MBBS కోర్సు పూర్తి చేసిన వైద్యుడు ఒకరు భారత్ కు తిరిగి వచ్చాడని, అతడిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో SMS ఆస్పత్రి దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు.
Read Also : వెంటాడుతున్న కరోనా వైరస్.. 2,700లకు పైగా కేసులు!