Iran-Israel war: ఇరాన్‌ అణు రియాక్టర్‌ను పేల్చేసిన ఇజ్రాయెల్ వైమానిక దళం.. 40 ఫైటర్ జెట్లు, 100 బాంబులతో అటాక్..

ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్దం రోజురోజుకు తీవ్రమవుతోంది.

Iran-Israel war: ఇరాన్‌ అణు రియాక్టర్‌ను పేల్చేసిన ఇజ్రాయెల్ వైమానిక దళం.. 40 ఫైటర్ జెట్లు, 100 బాంబులతో అటాక్..

Satellite image large hole in Arak reactor building

Updated On : June 20, 2025 / 9:21 AM IST

Arak Nuclear Reactor: ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్దం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఎనిమిది రోజులుగా ఇరు దేశాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. అణు బాంబుల తయారీ కోసం టెహ్రాన్‌కు ఉన్న అన్ని వనరులను నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుంది. ఈ క్రమంలో ఇరాన్ లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఏరియాను ఇజ్రాయెల్ వైమానిక దళం పేల్చేసింది.

Also Read: Israel Cyber War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ వార్.. 90 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ ధ్వంసం.. ప్రత్యర్థి ఆర్ధిక మూలాలపై దెబ్బ..

ఇరాన్‌లోని అరక్ ప్రాంతంలో ఉన్న న్యూక్లియర్ హెవీ రియాక్టర్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబు దాడి చేసిందని ఐడీఎఫ్ ధృవీకరించింది.  ప్రస్తుతం న్యూక్లియర్ రియాక్టర్.. ఇన్‌యాక్టివ్‌గా ఉందని తెలిపింది. అత్యంత శుద్ధీకరించిన ప్లుటోనియంను ఆ రియాక్టర్‌లో తయారు చేస్తున్నట్లు, ప్లుటోనియం ద్వారా అణ్వాయుధాలను రూపొందించనున్నారని, ప్లుటోనియం ప్రొడక్షన్‌కు కారణమైన కేంద్రంపై దాడిచేసి ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. దీనివ‌ల్ల మ‌ళ్లీ రియాక్ట‌ర్‌ను కానీ న్యూక్లియ‌ర్ వెప‌న్స్ డెవ‌ల‌ప్మెంట్ కోసం కానీ ఆ రియాక్ట‌ర్‌ను వాడరాద‌న్న ఉద్దేశంతో అటాక్ చేసిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది.


అణ్వాయుధాల అభివృద్ధి కోసం ఉపయోగించే అరక్ ప్రాంతంలోని హెవీ‌వాటర్ రియాక్టర్‌కు చెందిన కోర్ సీల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో రియాక్టర్ పేలిపోయిందని, అందులో ఎలాంటి అణుపదార్థం లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిర్ధారించింది. ఈ హెవీ వాటర్‌ను న్యూక్లియర్ రియాక్టర్లు చల్లబర్చేందుకు వాడతారు. అయితే, ఈ ప్రక్రియలో ప్లుటోనియం ఉత్పత్తి కూడా జరుగుతుంది. దీన్ని అణ్వాయుధాల తయారీలోనూ వినియోగిస్తారు. శుద్ది చేసిన యురేనియం లేకుండానే అణుబాంబును అభివృద్ధి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఇది.

Also Read: India Canada: ఉప్పు నిప్పు కలిశాయి.. మారిపోయిన కెనడా వైఖరి.. భారత్‌తో మెరుగుపడిన సంబంధాలు..

మే చివరిలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) త్రైమాసిక నివేదిక ప్రకారం.. ఇరాన్‌లోని రియాక్టర్‌లో చిన్న పౌర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇరాన్ ఈ సంవత్సరం దీనిని ప్రారంభించి.. 2026లో పనిచేయడం ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, అరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెవీ‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రియాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాను నామరూపాల్లేకుండా చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. అంతకుముందు ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాటిలైట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ రియాక్టర్ సమీపంలోని ప్రజలు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించింది. ఈ పోస్టు చేసిన కొన్ని గంటలకే ఇరాన్ హెవీ వాటర్ రియాక్టర్ పై ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడులు చేశాయి.

దాడి తరువాత అక్కడ రేడియేషన్ ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది. టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్, కుర్మనాషాతో సహా మొత్తం 40 ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారుచేసే కర్మాగారంపై మిస్సైళ్లను ప్రయోగించింది.