ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు: ఇరాన్‌లో కుప్పకూలిన విమానం

ఇరాన్‌లోని టెహ్రాన్ లో విమాన కుప్పకూలిపోయింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానం 737 విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రాజధాని కీవ్‌కు బయలుదేరిన విమానం టెహ్రాన్ ఇమామ్ ఖొమెయినీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 180మంది ప్రయాణీకులతో బయలుదేరింది. తరువాత టాకేఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదంలో జరిగింది.
సాంకేతిక లోపంతోనే విమానంకూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన అతి కొద్ది సమయానికే ఇరాన్ విమానం కూలిపోవటం గమనించాల్సి విషయం.
కాగా విమానానికి నిప్పు అంటుకోవటం వల్లనే కూలిపోయిందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం గాల్లో ఉండగానే నిప్పు అంటున్నట్లుగా ఈ వీడియో పుటేజ్ లో ఉంది.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. కాగా..180మంది ప్రయాణీకుల్లో ఎంతమంది చనిపోయారు అనే విషయం తెలియాల్సి ఉంది. విమానం టేకాఫ్ అయిన అతి కొద్ది సమయానికే రాడార్ తో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది.