Bangladesh Dhaka : ఇస్కాన్ టెంపుల్‌‌పై దాడి.. కూల్చివేసిన దుండగులు

ఓల్డ్ ఢాకాలోని వారీలో 222లాల్ మోహన్ సాహా వీధిలో ఇస్కాన్ రాధాకంట టెంపుల్ ఉంది. 2022, మార్చి 17వ తేదీ రాత్రి 200 మంది దుండగులు ఆలయంపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడుతున్నా...

Bangladesh Dhaka : ఇస్కాన్ టెంపుల్‌‌పై దాడి.. కూల్చివేసిన దుండగులు

Iskon

Updated On : March 18, 2022 / 12:49 PM IST

Iskcon Radhakanta Temple : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కొంతమంది చెలరేగిపోయారు. ప్రముఖ ఆలయమైన ఇస్కాన్ టెంపుల్ పై దుండగులు దాడి చేసి కూల్చివేయడం సంచలనం సృష్టించింది. దాడిలో సుమారు 200 మంది పాల్గొన్నారని, ఆలయాన్ని లూఠీ చేసినట్లు తెలుస్తోంది. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొంతమందిపై కూడా దాడికి పాల్పడడంతో వారు గాయపడ్డారు. దీనికి సంబంధించిన విషయాన్ని Voice Of Bangladeshi Hindus ట్వీట్ చేసింది. దాడికి పాల్పడిన దృశ్యాలను, వీడియో పోస్టు చేసింది.

Read More : Pegasus Spyware : తెరపైకి మరోసారి పెగాసస్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

ఓల్డ్ ఢాకాలోని వారీలో 222లాల్ మోహన్ సాహా వీధిలో ఇస్కాన్ రాధాకంట టెంపుల్ ఉంది. 2022, మార్చి 17వ తేదీ రాత్రి 200 మంది దుండగులు ఆలయంపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని Voice Of Bangladeshi Hindus ఆరోపించింది. ఆలయంలో ఉన్న మూర్తిపై దాడి చేసి అక్కడున్న నగదును అపహరించినట్లు తెలుస్తోంది. దాడిని అడ్డుకోనేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేయడంతో ముగ్గురు గాయపడ్డారని HAF తన వెబ్ సైట్ లో వెల్లడించింది.

Read More : Pegasus Spyware : పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు-లోకేష్ నారా

ఇటీవలే కొమిల్లా పట్టణంలోని నవరాత్రుల సందర్భంగా.. దుర్గామండపంలో ఉన్న ఖురాన్ ను అపవిత్రం చేశారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీంతో జరిగిన అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.