Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ మిమ్మల్ని వదిలిపెట్టదు.. పాక్ మాకు హామీ ఇచ్చిందన్న ఇరాన్ టాప్ లీడర్

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ది కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుంది.

Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ మిమ్మల్ని వదిలిపెట్టదు.. పాక్ మాకు హామీ ఇచ్చిందన్న ఇరాన్ టాప్ లీడర్

Ebrahim Raisi Shehbaz Sharif

Updated On : June 16, 2025 / 4:57 PM IST

Israel-Iran War: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ది కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుంది. ఈ దాడులతో టెహ్రాన్ లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై ప్రతిదాడులకు దిగుతుంది. దీంతో ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి.

టార్గెట్ అలీ ఖమేనీ..
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టార్గెట్ గా క్షిపణుల దాడులు చేస్తోంది. ఖమేనీ నివాసంతోపాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియో ప్రాంతంలో ఇజ్రాయెల్ గత శుక్రవారం అర్ధరాత్రి వైమానిక దాడులు జరిపింది. ఖమేనీ నివాసానికి అత్యంత సమీపంలో ఈ పేలుళ్లు జరిగినట్లు టెహ్రాన్ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ఖమేనీ, అతని కుటుంబాన్ని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈశాన్య టెహ్రాన్ లోని అండర్ గ్రౌండ్ బంకర్ లో ఖమేనీ, ఆయన కుటుంబం తలదాచుకున్నట్లు తెలిసింది.


వారి టార్గెట్ ట్రంప్.. 
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నా రెండు దేశాలు పట్టించుకోవటం లేదు. తాజాగా.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ వన్ శత్రువు.. ఆయన్ను చంపాలని టెహ్రాన్ చూస్తోందని అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు.. అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదు. అందుకోసం ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన శత్రువుగా మారారిన, ఆయన్ను చంపాలని ఇరాన్ చూస్తోందని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశాడు.


అదే జరిగితే.. పాకిస్థాన్ ఇజ్రాయెల్‌ను వదిలి పెట్టదు..
ప్రపంచంలో అణ్వాయుధాలున్న దేశాల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ తో సహా పాకిస్థాన్ కూడా ఉంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఇరాన్ పై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగుతుందని, ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహిసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్ మాపై అణుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్‌అవీవ్ పై అణుబాంబును ప్రయోగిస్తుందని, ఆ మేరకు మాకు ఇస్లామాబాద్ నుంచి హామీ వచ్చిందంటూ ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.