Iran Israel conflict: అందుకు మేము ఒప్పుకోం.. ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన అమెరికా

క్షిణ లెబనాన్ లో జరిగిన పోరులో ఇజ్రాయెల్ సైన్యంకు చెందిన ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. సరిహద్దు దాటిన తరువాత

Iran Israel conflict: అందుకు మేము ఒప్పుకోం.. ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన అమెరికా

Israel Lebanon Conflict

Updated On : October 3, 2024 / 7:22 AM IST

Israel Lebanon Conflict Row: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల దాడి తరువాత ఉద్రిక్తతను తగ్గించడానికి జీ7 దేశాలు బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇరాన్ దాడుల ద్వారా మొత్తం మధ్యప్రాచ్యాన్ని పెద్ద యుద్ధం అంచునకు తీసుకువచ్చిందని ఇజ్రాయెల్ పేర్కొంది. తమ దేశం మధ్యప్రాచ్యంలో ఎక్కడైనా దాడి చేయగలదని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ చెప్పారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అధ్యర్యంలో జీ7 దేశాల నాయకులు అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించారు.

Also Read : ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా? ఇక వినాశమేనా?

మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన పరిష్కారంకోసం తాము ఇంకా ఆశాజనకంగా ఉన్నామని, ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని భావిస్తున్నామని జీ7 నేతలు అభిప్రాయపడ్డారు. జీ7లో ఇటలీతోపాటు అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ దేశాలు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తు లో ఇజ్రాయెల్ పై దాడి చేయవద్దు.. ఇరాన్ కూడా దాడులు చేయకుండా ప్రాక్సీ ఉగ్రవాద సంస్థలను ఆపాలని సూచించింది. ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తూ.. ఆ దేశానికి రక్షణగా ఉండటానికి అమెరికా కట్టబడి ఉందని.. అయితే.. ఇజ్రాయెల్ కూడా తమ సూచనను పాటించాలని పేర్కొంది. తాము ఇజ్రాయెల్ కు మద్దతిస్తున్నానని.. అయితే, ఇరాన్ అణు కేంద్రాలకు సంబంధించిన ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులకు తాము మద్దతివ్వబోమని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం తెలిపారు.

Also Read : ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పై నిషేధం..

ఇదిలాఉంటే.. దక్షిణ లెబనాన్ లో జరిగిన పోరులో ఇజ్రాయెల్ సైన్యంకు చెందిన ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. సరిహద్దు దాటిన తరువాత హెజ్బెల్లా యోధులు జరిపిన కాల్పుల సమయంలో వారు మరణించారని ఇజ్రాయెల్ పేర్కొంది. మరో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ సైన్యం) ప్రకటించింది.