Israel Sponge Bomb: స్పాంజ్ బాంబ్.. ఇజ్రాయల్ కొత్త రహస్య ఆయుధం.. ఇది ఎంత డేంజరస్ అంటే..
ఇరాన్‌ను ఎదుర్కోవడానికి ఇజ్రాయల్ కూడా చాలా ప్రాణాంతకమైన ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. దీనిని స్పాంజ్ బాంబ్స్ అని పిలుస్తారు.

Israel Sponge Bomb: ఇజ్రాయల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. యుద్ధం 5వ రోజుకి ప్రవేశించింది. ఇరు దేశాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు బాంబులు, క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఇరాన్ ప్రయోగించిన 120 కి పైగా ఉపరితలం నుండి ఉపరితలం క్షిపణి లాంచర్లను నాశనం చేశామని ఇజ్రాయల్ సైన్యం తెలిపింది.
ప్రస్తుతం టెహ్రాన్ గగనతలం మా నియంత్రణలో ఉంది అని ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి ముప్పులను నాశనం చేసే లక్ష్యాలను సాధించే దిశగా తమ దేశం సాగుతోందన్నారు.
ఇరాన్ అణు, క్షిపణి, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయల్ శుక్రవారం తెల్లవారుజామున ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను ప్రారంభించింది. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయల్‌పై భీకర దాడులు ప్రారంభించింది. కొన్ని ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయల్ దేశం నడిబొడ్డున ఉన్న భవనాలను తాకాయి. దీంతో యుద్ధం తారస్థాయికి చేరింది.
ఇరాన్‌ను ఎదుర్కోవడానికి ఇజ్రాయల్ కూడా చాలా ప్రాణాంతకమైన ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. దీనిని స్పాంజ్ బాంబ్స్ అని పిలుస్తారు. దీనిని ఇజ్రాయల్ ‘కొత్త రహస్య ఆయుధం’ అని పిలుస్తారు. ఇది ఒక రకమైన రసాయన గ్రెనేడ్. ఇందులో పేలుడు పదార్థాలు ఉండవు. కానీ సొరంగం ప్రవేశాలను మూసివేయడానికి లేదా సీల్ చేయడానికి ఉపయోగించవచ్చు.
నివేదికల ప్రకారం, “స్పాంజ్ బాంబులు” ఒక రక్షిత ప్లాస్టిక్ కంటైనర్‌లో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇది రెండు విభిన్న ద్రవాలను విభజించే మెటల్ బ్యారియర్ ని కలిగి ఉంటుంది. ఒకసారి యాక్టివేట్ చేయబడిన తర్వాత ఈ ద్రవాలు విలీనం అవుతాయి. ఉద్దేశించిన గమ్యస్థానం వైపు ముందుకు సాగుతాయి.