హిందుత్వంపై ఇండోనేషియా ఫోకస్…తొలి హిందూ యూనివర్శిటీ ఏర్పాటు

  • Published By: venkaiahnaidu ,Published On : February 3, 2020 / 10:14 PM IST
హిందుత్వంపై ఇండోనేషియా ఫోకస్…తొలి హిందూ యూనివర్శిటీ ఏర్పాటు

Updated On : February 3, 2020 / 10:14 PM IST

ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది హిందూయిజంను ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే. హిందూయిజాన్ని ఓ మతంగా కాకుండా ధర్మంగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే ఇండోనేషియా కూడా హిందూ కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆశక్తి చూపుతోంది. హిందూ ఉన్నత విద్యా కార్యక్రమాలు ప్రొత్సాహించాలని నిర్ణయించిన ఇండోనేషియా తమ దేశంలో మొదటి హిందూ యూనివర్శిటీని తీసుకొచ్చింది.

ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవి…బాలి ఫ్రావిన్స్ లోని డెన్‌పసర్‌లోని హిందూ ధర్మ స్టేట్ ఇనిస్టిట్యూట్ (IHDN)ను దేశంలోని మొట్టమొదటి హిందూ రాష్ట్ర విశ్వవిద్యాలయంగా మారుస్తూ ప్రెసిడెన్షియల్ రెగ్యులేషన్ ను జారీ చేశారు. ఐ గుస్టి బాగస్ సుగ్రీవా స్టేట్ హిందూ విశ్వవిద్యాలయం (UHN)అనే కొత్త విశ్వవిద్యాలయం…హిందూ ఉన్నత విద్యా కార్యక్రమాలను సపోర్ట్ చేయడానికి హిందూ ఉన్నత విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుందని,అదేవిధంగా అన్ని రకాల ఇతర ఉన్నత విద్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆ రెగ్యులేషన్ లో పేర్కొన్నారు. గత వారం అమల్లోకి వచ్చిన రెగ్యులేషన్ ద్వారా, ప్రస్తుత IHDN విద్యార్థులందరూ UHN విద్యార్థులుగా మార్చబడతారు. IHDN సంస్థ యొక్క అన్ని ఆస్తులు మరియు ఉద్యోగులు కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయానికి బదిలీ చేయబడతారు.

ఈ సంస్థ 1993 లో హిందూ మతం ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర అకాడమీగా ప్రారంభమైన ఈ సంస్థ 1999 లో హిందూ మతం స్టేట్ కాలేజీగా, 2004 లో IHDN గా మార్చబడిందని, అధ్క్షుడు జారీ చేసిన రెగ్యులేషన్ తో ఇప్పుడు ఇండోనేషియాలోని హిందూ విశ్వాసులకు ఇది ఒక చారిత్రాత్మక క్షణం అని IHDN రెక్టార్ సుడియానా చెప్పారు. మానవ రాజధాని బాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు అధ్యక్షుడు జోకోవి బాలిలోని హిందూ విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఇది స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో బాలిలో అద్భుతమైన మానవ రాజధాని వైపు వెళ్ళడానికి ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.